Begin typing your search above and press return to search.

మెగా154 రిలీజ్ డేట్ ఫిక్స్.. 2023 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్..!

By:  Tupaki Desk   |   24 Jun 2022 6:30 AM GMT
మెగా154 రిలీజ్ డేట్ ఫిక్స్.. 2023 సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్..!
X
మెగాస్టార్ చిరంజీవి మరియు టాలెంటెడ్ డైరెక్టర్ బాబీ (కెఎస్ రవీంద్ర) కాంబినేషన్ లో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. #MEGA154 అనే వర్కింగ్ టైటిల్ తో మోస్ట్ హ్యాపెనింగ్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకొచ్చింది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ మూవీ థియేట్రికల్ రిలీజ్ డేట్ ని లాక్ చేశారు.

మెగా అభిమానులు మరియు సినీ ప్రేక్షకులకు మెగా అప్‌డేట్ ఏమిటంటే.. చిరంజీవి 154వ చిత్రాన్ని 2023 సంక్రాంతి కానుకగా విడుదల చేయబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా “కలుద్దాం… సంక్రాంతి కి.. జనవరి 2023” అంటూ అనౌన్స్ మెంట్ పోస్టర్ ను ఆవిష్కరించారు.

ఇందులో మెగాస్టార్ ముఖం కనిపించనప్పటికీ, చేతిలో యాంకర్‌ ను పట్టుకోడాన్ని చూస్తుంటే ఇదొక హై వోల్టేజ్ యాక్షన్ ఎపిసోడ్ లోని సన్నివేశాన్ని సూచిస్తోంది. బ్యాక్‌గ్రౌండ్‌ లో సముద్రం మరియు పడవలు కనిపిస్తున్నాయి. ఈ చిత్రానికి సంబంధించిన అఫీషియల్ టైటిల్ ను త్వరలోనే వెల్లడించి.. టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

మెగా154 మూవీ ఇప్పటికే 40% చిత్రీకరణను పూర్తి చేసుకుంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ వచ్చే నెల నుండి ప్రారంభమవుతుంది. వచ్చే సంక్రాంతి పండగ లక్ష్యంగా నాన్‌ స్టాప్‌ గా షూటింగ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. గతంలో చిరంజీవి సినిమాలు చాలావరకు ఇదే సీజన్ లో రిలీజై బ్లాక్ బస్టర్స్ అయ్యాయి.

కాకపోతే ఈసారి యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న 'ఆది పురుష్'.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' వంటి పాన్ ఇండియా చిత్రాలు 2023 సంక్రాంతి కి ఫిక్స్ అయ్యాయి. వీటితోపాటుగా తమిళ హీరో విజయ్ తెలుగు డెబ్యూ 'వారసుడు' కూడా పొంగల్ కే రానుందని నిర్మాతలు ప్రకటించారు. ఇప్పుడు మెగాస్టార్ కూడా అదే సీజన్ లో రావాలని నిర్ణయించుకున్నారు. అంటే వచ్చే ఫెస్టివల్ కి బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ క్లాష్ ని చూడబోతున్నాం.

MEGA154 విషయానికొస్తే.. చిరంజీవికి వీరాభిమాని అయిన దర్శకుడు బాబీ.. ఇంతకు ముందెన్నడూ చూడని మాస్-అప్పీలింగ్ మరియు పవర్-ప్యాక్ పాత్రలో మెగాస్టార్ ను చూపించడానికి కృషి చేస్తున్నాడు. టైటిల్ - ఫస్ట్ లుక్ విడుదల చేసిన రోజు నుంచి పూనకాలు మొదలవుతాయని చిత్ర బృందం చెబుతోంది.

కమర్షియల్ హంగులతో కూడిన ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో చిరంజీవి సరసన శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది. నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. జికె మోహన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో స్టార్ క్యాస్టింగ్ మరియు అగ్రశ్రేణి సాంకేతిక బృందం భాగం అవుతున్నారు.

మెగాస్టార్ కు అనేక చార్ట్‌ బస్టర్ ఆల్బమ్స్ అందించిన రాక్‌ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తున్నారు. ఆర్థర్ ఎ విల్సన్ సినిమాటోగ్రఫీని నిర్వహిస్తున్నారు. నిరంజన్‌ దేవరమానె ఎడిటర్‌ గా.. ఎఎస్‌ ప్రకాష్‌ ప్రొడక్షన్‌ డిజైనర్‌ గా వర్క్ చేస్తున్నారు. సుస్మిత కొణిదెల కాస్ట్యూమ్ డిజైనింగ్ చేస్తోంది.

బాబీ కథ, మాటలు రాయగా.. కోన వెంకట్ - కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ ప్లే రాశారు. హరి మోహన కృష్ణ మరియు వినీత్ పొట్లూరి కూడా రైటింగ్ డిపార్ట్‌మెంట్‌ లో ఉన్నారు. సంక్రాంతి వార్ లో దిగబోతున్న మెగా154 ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.