Begin typing your search above and press return to search.
మెగాస్టార్ మనవరాలు ప్రేయసినా? స్నేహితురాలా?
By: Tupaki Desk | 1 July 2021 7:00 PM ISTబాలీవుడ్ మెగాస్టార్ అమితాబచ్చన్ మనవరాలు నవ్య నవేలి సోషల్ మీడియాలో చాలా ఫేమస్. ఆమె సినిమా ల్లో నటిస్తుందనే వార్తలతో పాటు ఆమె బాలీవుడ్ యంగ్ హీరో మీజాన్ జాఫెరీ తో ప్రేమలో ఉన్నట్లుగా రెగ్యులర్ గా వార్తలు వస్తూనే ఉన్నాయి. మీజాన్ తండ్రి జావేద్ ఇటీవల ఒకానొక సందర్బంగా మాట్లాడుతూ నవ్య మరియు మీజాన్ లు మంచి స్నేహితులు మాత్రమే. అంతుకు మించి వారి మద్య ఏమీ ఉండదు అన్నట్లుగా చెప్పుకొచ్చాడు. కాని ఆయన మాటలు కూడా పట్టించుకోకుండా మీడియా ఇద్దరి మద్య ప్రేమ వ్యవహారం గురించి కుప్పలు తెప్పలుగా కథనాలు అల్లుతూనే వస్తున్నారు.
జావేద్ మీజాన్ ఇటీవల ప్రేమ విషయమై స్పందించాడు. నవ్య నవేలితో తనకు ప్రేమ ఉన్నట్లుగా మీడియాలో వస్తున్న వార్తలను ఖండించాడు. నాకు ఆమె బెస్ట్ ఫ్రెండ్. నాకు మాత్రమే కాదు నా సోదరికి కూడా ఆమె మంచి స్నేహితురాలు. ఆమె గురించి మాట్లాడిన ప్రతి సారి నా గురించి మాట్లాడటం అన్యాయం. ఆమెకు అంటూ వ్యక్తిగత జీవితం ఉంటుంది. ఆమె ఫీలింగ్స్ ను అర్థం చేసుకుని మీడియా వారు ఇకపై అయినా పుకార్లను కట్టి పెట్టాలంటూ మీజాన్ విజ్ఞప్తి చేశాడు.
మీడియాలో వస్తున్న పుకార్ల కారణంగా ఇద్దరం కూడా ఇబ్బంది పడుతున్నాం. మీడియాలో వస్తున్న వార్తలకు ఇంట్లో అడుగు పెట్టాలన్నా ఇబ్బందిగానే ఉంది. నా తల్లిదండ్రులు నా వైపు అదోరకంగా చూస్తున్నారు. ఏంటీ ఈ వార్తలు అన్నట్లుగా చూస్తున్న వారి చూపులకు నాకు ఇబ్బంది గా ఉంది. ఇకపై అయినా ఇలాంటి పుకార్లు తగ్గుతాయని ఆశిస్తున్నాను అంటూ ఆయన విజ్ఞప్తి చేశాడు.