Begin typing your search above and press return to search.

బ‌ర్త్ డే స్పెష‌ల్ : వెంకీ మామ రాయ‌ల్ ఎంట్రీ అదిరింది

By:  Tupaki Desk   |   13 Dec 2021 6:30 AM GMT
బ‌ర్త్ డే స్పెష‌ల్ : వెంకీ మామ రాయ‌ల్ ఎంట్రీ అదిరింది
X
విక్ట‌రీ వెంక‌టేష్, మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ క‌లిసి న‌టిస్తున్న చిత్రం `ఎఫ్ 3`. అనిల్ రావిపూడి తెర‌కెక్కిస్తున్న ఈ మూవీ `ఎఫ్ 2` కు కొన‌సాగింపుగా రూపొందుతోంది. గ‌త చిత్రానికి మించిన ట్రిపుల్ ఎంట‌ర్‌టైన్‌మెంట్ తో బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌నుంది. దీంతో ఈ మూవీపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. బాలీవుడ్ తో పాటు ఇత‌ర భాష‌ల‌కు చెందిన స్టార్స్ కూడా ఈ మూవీ ఫ‌లితంపై ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నార‌ట‌. ఈ రోల‌ర్ కోస్ట‌ర్ ఫ‌న్ రైడ్ ని ప్రామిసింగ్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఆయ‌న సోద‌రుడు శిరీష్ తో క‌లిసి నిర్మిస్తున్నారు.

ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది. ఇందుకు సంధించిన ఏర్పాట్లు కూడా చ‌క‌చ‌కా జ‌రిగిపోతున్నాయి. ఇదిలా వుంటే సోమ‌వారం విక్టీరీ వెంకటేష్ వెంకీ మామ బ‌ర్త్ డే సంద‌ర్భంగా చిత్ర బృందం ప్ర‌త్యేకంగా ఆయ‌న‌కు విషేష్ ని అందిజేస్తూ గ్లింప్స్ ని విడుద‌ల చేసింది. అంతే కాకుండా ఓ కొత్త పోస్ట‌ర్‌ని కూడా రిలీజ్ చేశారు. ఈ బ‌ర్త్ డే గ్లింప్స్ లో విక్ట‌రీ వెంక‌టేష్ చార్మినార్ ముందు ప్ర‌త్యేకంగా ఏర్పాటే చేసిన ఎడ్ పై రాయ‌ల్ లుక్ లో క‌నిపిస్తున్న తీరు ప్రేక్ష‌కుల్నిఆక‌ట్టుకుంటోంది.

రైట్ హ్యాండ్ లో టూ థైజెండ్ నోట్స్‌ని విస‌న‌క‌ర్ర‌లా ఊపుకుంటూ రాయ‌ల్ లుక్‌లో యమ ద‌ర్జాగా వెంకీ క‌నిపిస్తున్న తీరు సినిమా కాన్సెప్ట్ ని తెలియ‌జేస్తోంది. చార్మినార్ నావాబ్ లా వెంకీ మేకోవ‌ర్‌, లుక్ క‌నిపిస్తోంది. వెంకీ క్యారెక్ట‌ర్‌ని ప‌రిచ‌యం చేసే సంద‌ర్భంలో వ‌చ్చే పాట‌కు ముందు లీడ్‌లా ఈ వీడియో ని చిత్రీక‌రించ‌న‌ట్టుగా క‌నిపిస్తోంది. వెంకీ చుట్టు వున్న జ‌నం డిఫ‌రెండ్ కాస్ట్యూమ్స్ ని ధ‌రించి న‌వాబ్ ముందు ఆడే జ‌నంలా క‌నిపిస్తున్నారు. దీంతో సినిమా ఓ రేంజ్‌లో ఆడియ‌న్స్‌ని ఎంట‌ర్‌టైన్ చేయ‌డం గ్యారంటీగా క‌నిపిస్తోంది.

గ్లింప్స్ లో వెంకీ మామ లుక్ కొత్త‌గా వుండ‌టంతో అంతా ఫ‌న్ `ఎఫ్ 2`కి మించి వుండేలా క‌నిపిస్తోందంటున్నారు. ఈ చిత్రంలో న‌ట‌కిరీటి రాజేంద్ర ప్ర‌సాద్‌, సునీల్,సొనాల్ చౌహాన్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. త‌మ‌న్నా, మెహ్రీన్ హీరోయిన్‌లు క‌నిపించ‌నున్న విష‌యం తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ గా నిలిచిన `ఎఫ్‌ 2` ని మించిన వినోదంతో రూపొందుతున్న ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో బాక్సాఫీస్ వ‌ద్ద వ‌రల్డ్ వైడ్‌గా సంచ‌నాలు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోందని అప్పుడే ట్రేడ్ వ‌ర్గాలు జ్యోష్యం చెబుతుండ‌టం విశేషం.