Begin typing your search above and press return to search.

ర‌వితేజ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్

By:  Tupaki Desk   |   17 March 2022 3:30 PM GMT
ర‌వితేజ హీరోయిన్ సెకండ్ ఇన్నింగ్స్
X
మాస్ మ‌హారాజా ర‌వితేజ హీరోయిన్ మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ మొద‌లుపెట్టేసింది. తెలుగులో `అమ్మాయి బాగుంది` చిత్రంతో ఎంట్రీ ఇచ్చినా ప‌వ‌న్ క‌ల్యాణ్ - వీర‌శంక‌ర్ ల క‌ల‌యిక‌లో రూపొందిన `గుడుంబా శంక‌ర్‌` చిత్రంతో హీరోయిన్ మంచి పేరుతో పాటు గుర్తింపుని సొంతం చేసుకుంది. ఇక ఆ త‌రువాత ర‌వితేజ - బోయ‌పాటి శ్రీ‌నుల క‌ల‌యిక‌లో వ‌చ్చిన `భ‌ద్ర‌` మీరా జాస్మిన్ కు తెలుగులో తొలి బ్లాక్ బ‌స్ట‌ర్ విజ‌యాన్ని అందించింది.

ఈ మూవీ త‌రువాత తెలుగులో వ‌రుస క్రేజీ చిత్రాల్లో న‌టించిన మీరా జాస్మిన్ 2013లో వ‌చ్చిన హార‌ర్ థ్రిల్ల‌ర్ `మోక్ష‌` త‌రువాత తెలుగులో క‌నిపించ‌కుండా పోయింది. కేవ‌లం త‌మిళ‌, మ‌ల‌యాళ చిత్రాల‌కే ప‌రిమితం అయిపోయింది. దాదాపు 9 ఏళ్లుగా తెలుగు చిత్రాల‌కు దూరంగా వుంటూ వ‌స్తున్న మీరా జాస్మిన్ మ‌ళ్లీ ఇన్నాళ్ల‌కు తెలుగులో బిజీ కావాల‌ని ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది. దుబాయ్ కి చెందిన ఇంజ‌నీర్ ని 2014లో వివాహం చేసుకుని కంప్లీట్ గా టాలీవుడ్ కు దూర‌మైన మీరా జాస్మిన్ సెకండ్ ఇన్నింగ్స్ కి రెడీ అవుతోంది.

తెలుగులో ఎలాంటి హాట్ క్యారెక్ట‌ర్ లో అయినా తాను న‌టించ‌డానికి రెడీ అంటూ ఇటీవ‌ల హాట్ ఫొటో షూట్ ల‌తో హింట్ ఇచ్చేసిన మీరా జాస్మిన్ న‌టించిన మ‌ల‌యాళ చిత్రం `మాక‌ల్‌` త్వ‌ర‌లో రిలీజ్ కి రెడీ అవుతోంది. జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌లో న‌టించిన ఈ చిత్రాన్ని స‌త్య‌న్ అంతికాడ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. సెంట్ర‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించింది. విభిన్న‌మైన క‌థ‌, క‌థ‌నాల‌తో తెర‌కెక్కిన ఈ చిత్ర టీజ‌ర్ ని మేక‌ర్స్ తాజాగా గురువారం విడుద‌ల చేశారు.

టీజ‌ర్ ని బ‌ట్టి చూస్తుంటో వినోదంతో సాగే ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా క‌నిపిస్తోంది. జ‌య‌రామ్ కీల‌క పాత్ర‌లో క‌నిపించారు. మీరా జాస్మిన్ గ‌త చిత్రాల‌కు పూర్తి భిన్నంగా మ‌రింత అందంగా క‌నిపించింది. గ‌తంలో మీరా ఎంత అందంగా గ్లామ‌ర‌స్ గా క‌నిపించిందో తాజా టీజ‌ర్ లో అదే స్థాయిలో క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటున్నార‌ట‌. అభిమాన న‌టి చాలా ఏళ్ల త‌రువాత మ‌ళ్లీ తెర‌పై క‌నిపించ‌బోతూ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేస్తుండ‌టంతో ఫ్యాన్స్ మీరా జాస్మిన్ కు ఆనందంగా వెల్ క‌మ్ చెబుతున్నార‌ట‌. మ‌రి తెలుగులో ఏ డైరెక్ట‌ర్ మీరా సెకండ్ ఇన్నింగ్స్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌బోతున్నాడ‌న్న‌ది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.