Begin typing your search above and press return to search.

ట్రెడీషనల్‌ బ్యూటీ హాట్ అందాలతో మతి పోగొట్టేస్తోంది

By:  Tupaki Desk   |   7 Feb 2022 7:34 AM GMT
ట్రెడీషనల్‌ బ్యూటీ హాట్ అందాలతో మతి పోగొట్టేస్తోంది
X
మలయాళం సినిమా సూత్రదరన్‌ తో సినిమా ఇండస్ట్రీలో 2001 సంవత్సరంలో అడుగు పెట్టిన మీరా జాస్మిన్‌ పదేళ్ల పాటు వరుసగా సినిమాలు చేసింది. తెలుగు లో ఈమె 2004 సంవత్సరంలో అమ్మాయి బాగుంది మరియు గుడుంబా శంకర్ సినిమాలతో ఎంట్రీ ఇచ్చింది. తెలుగు లో ఈమె చేసిన మొదటి రెండు సినిమాలు కూడా మంచి పేరును తెచ్చి పెట్టాయి. అమ్మాయి బాగుంది సినిమాలో రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి మెప్పించిన ఈ అమ్మడు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గుడుంబా శంకర్ లో కూడా ఆకట్టుకుంది.

ఆ రెండు సినిమాలు తెచ్చిన క్రేజ్ తో తెలుగు లో బ్యాక్ టు బ్యాక్‌ పెద్ద సినిమాల ఆఫర్లను దక్కించుకున్న మీరా జాస్మిన్‌ 2010 తర్వాత పెద్దగా కనిపించడం లేదు. తమిళం మరియు మలయాళం సినిమాలకు పరిమితం అయిన ఈ అమ్మడు ఈమద్య తెలుగు ప్రేక్షకుల దృష్టిని విశేషంగా ఆకట్టుకుంది.

అందుకు కారణం ఈమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసిన హాట్ ఫొటో షూట్‌. ఇప్పటి వరకు మీరా జాస్మిన్‌ ను తెలుగు ప్రేక్షకులు చాలా పద్దతైన అమ్మాయిగా.. ట్రెడిషనల్ బ్యూటీ గా పేరు దక్కించుకుంది. అలాంటి మీరా జాస్మిన్‌ ను ఇన్నాళ్ల తర్వాత ఇంత హాట్ గా చూడటం ఆశ్చర్యంగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు.

ఇదే సమయంలో ఈ అమ్మడిని తెలుగు లో మళ్లీ నటింపజేసేందుకు కూడా కొందరు టాలీవుడ్‌ ఫిల్మ్‌ మేకర్స్‌ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మీరా జాస్మిన్‌ ఇండస్ట్రీలో అడుగు పెట్టి రెండు దశాబ్దాలు అయినా కూడా ఇంకా తన అందాలతో మతి పోగొట్టేస్తుండటం ఆశ్చర్యమే. ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో ఈమద్య కాలంలో యాక్టివ్‌ గా ఉంటూ తన హాట్ ఫొటో షూట్స్ ను షేర్‌ చేస్తుంది.

గతంతో పోల్చితే చాలా నాజూకుగా మారిన ఈ అమ్మడు ఇంకా కూడా స్టార్‌ హీరోలకు జోడీగా నటించేలా అందంగా ఉందనే కామెంట్స్ దక్కించుకుంటుంది. నాలుగు పదుల వయసుకు చేరువ అయినా కూడా ఈ కేరళ కుట్టి తన అందం విషయంలో మాత్రం పాతికేళ్ల వద్దే ఉండి పోయినట్లుగా ఈ ఫొటో లను చూస్తుంటే అనిపిస్తుంది.

అందంతో పాటు చక్కని నటన ప్రతిభ ఉన్న ఈ అమ్మడు తెలుగు లో రీ ఎంట్రీ ఇస్తే ఈసారి ఖచ్చితంగా మంచి అవకాశాలు ఆమెకు వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. మీరా జాస్మిన్‌ తెలుగు లో చేసిన పలు సినిమాలు ఇప్పటికి కూడా బుల్లి తెరపై వస్తున్న సమయంలో ఆమె అందం గురించి ఆమె పద్దతి ట్రెడీషనల్‌ లుక్ గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అలాంటి ట్రెడీషనల్‌ మీరా జాస్మిన్‌ ఇలా అందాల ఆరబోయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ ఏడాదిలో మలయాళ సినిమా మక్కల్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. మరి కొన్ని సినిమాలు కూడా ఈమె చేతికి రాబోతున్నాయట