Begin typing your search above and press return to search.

ఇంత‌లా గ్లామ‌ర్‌ షో చేస్తున్నా మీరాను ప‌ట్టించుకోవ‌డం లేదే!?

By:  Tupaki Desk   |   23 Sep 2022 6:09 AM GMT
ఇంత‌లా గ్లామ‌ర్‌ షో చేస్తున్నా మీరాను ప‌ట్టించుకోవ‌డం లేదే!?
X
అందం, అభినయం అంతకుమించిన టాలెంట్ ఉన్న హీరోయిన్లలో మీరా జాస్మిన్ ఒకరు. మలయాళ ముద్దుగుమ్మ అయినప్పటికీ తెలుగులో అనతికాలంలోనే తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకుంది. 'అమ్మాయి బాగుంది' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన మీరా జాస్మిన్.. ఆ వెంటనే మాస్ మహారాజ్‌ రవితేజ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వచ్చిన 'భద్ర' సినిమాలో నటించింది. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.

ఇందులో మీరా అచ్చం తెలుగింటి ఆడపిల్లలా కనిపిస్తూ ప్రేక్షకుల మదిని దోచుకుంది. ఈ మూవీ అనంతరం మీరా జాస్మిన్ కు టాలీవుడ్ లో ఆఫర్లు వెల్లువెత్తాయి. ఈ క్రమంలోనే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన 'గుడుంబా శంకర్', నటసింహం నందమూరి బాలకృష్ణ తో 'మహారధి' సినిమాల్లో నటించింది. అలాగే మరోవైపు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో నటిస్తూ బిజీ హీరోయిన్ గా గడిపింది.

కానీ మీరా జాస్మిన్ చేసిన కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల ఆమె సినీ కెరీర్ అనూహ్యంగా డౌన్ అయిపోయింది. ఇక చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్న మీరా జాస్మిన్ ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభించింది. మ‌ల‌యాళ చిత్రం 'మక్కల్'తో మీరా రీఎంట్రీ ఇచ్చింది. ప్రముఖ దర్శకుడు సత్యన్ అంతిక్కడ్ తెరకెక్కించిన‌ ఈ చిత్రంలో జయరామ్, దేవిక సంజయ్ తదితరులు ప్రధాన పాత్ర‌ల‌ను పోషించారు.

ఏప్రిల్ లో విడుదలైన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన లభించింది. ఇకపోతే సెకండ్ ఇన్నింగ్స్ లో మీరా జాస్మిన్‌ వరుస ఆఫర్లను పట్టాలని తెగ ప్రయత్నం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియా వేదికగా హద్దులు దాటి మరీ అందాలు ఆరబోస్తోంది. నాలుగు పదుల వయసులోనూ తగ్గేదేలే అంటూ గ్లామ‌ర్ షోతో కుర్రకారుకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది.

దీంతో సోషల్ మీడియాలో ఈ బ్యూటీకి ఫాలోయింగ్ అంతకంతకు పెరిగిపోతోంది. అయినా సరే మీరా జాస్మిన్ ను ఎవరూ పట్టించుకోకపోవడం గమనార్హం. కెరీర్ ఆరంభం నుంచి మీరా జాస్మిన్ ఎలాంటి అందాల ప్ర‌ద‌ర్శ‌న చేయ‌క‌పోయినా.. తనదైన టాలెంట్ తో వ‌రుస ఆఫ‌ర్ల‌ను అందుకుంది.

కానీ సెకండ్ ఇన్నింగ్స్ లో మాత్రం రూటు మార్చి అందాలతో అరాచకం సృష్టిస్తోంది. అయితే ఈ రూటు ఏమీ ఆమెకు పెద్దగా కలిసి వచ్చేటట్లు కనిపించడం లేదు. ఆమె అందాల‌ను పొగుడుతున్న వారే కానీ.. ఆఫ‌ర్లు ఇచ్చేవారు మాత్రం దొర‌క‌ట్లేదు. మ‌రి ఇక‌ముందైనా మీరా జాస్మిన్ సెకెండ్ ఇన్నింగ్స్ లో నిల‌దొక్కుకుంటుందా..లేదా.. అన్న‌ది చూడాలి.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.