Begin typing your search above and press return to search.
డ్రగ్స్ కేసులో చాలా సాక్ష్యాలు నాశనం చేశారన్న బ్యూటీ
By: Tupaki Desk | 28 Sept 2020 11:00 PM ISTసెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) ను ప్రజలు విశ్వసించాలని, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణ దర్యాప్తులో ఏజెన్సీ తన పనిని చేయనివ్వాలని సిట్రెస్ బ్యూటీ మీరా చోప్రా పేర్కొంది. ``చాలా సాక్ష్యాలు నాశనం చేశాక.. ఇంత సమయం ఆలస్యమయ్యాక ఈ కేసును దర్యాప్తు చేయడం చాలా కష్టం. మనమంతా సీబీఐ ని విశ్వసించాలి. వారు తమ పనిని చేయనివ్వండి. దేశంలో అందరి సాధారణ భావన #SSRడెత్ కేస్ లో న్యాయం జరగడం మాత్రమే. అధికారులు ఆ మనోభావాన్ని విస్మరించలేరు`` అని మీరా ట్వీట్ చేసింది.
సిబిఐ ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్ ఆలస్యమవుతున్నందుకు అప్పటికే ఎదురుచూస్తున్నప్పుడు సుశాంత్ అభిమానులు అసహనానికి గురైన సమయంలో ఆమె ఇలా ట్వీట్ చేయడం విశేషం. సుశాంత్ ఆకస్మిక మరణం అనంతరం దర్యాప్తులో ఆలస్యం జరిగిందని ఆరోపిస్తూ మహారాష్ట్ర హోంమంత్రిత్వ శాఖ అనిల్ దేశ్ ముఖ్ సోమవారం సిబిఐ దర్యాప్తు స్థితిని తెలుసుకోవాలని కోరింది. ఇది దర్యాప్తు చేపట్టిన ఆరు వారాల కన్నా ఎక్కువ అయ్యింది.
``మేం ఆసక్తిగా తెలుసుకోవాలనుకుంటున్నాం. సుశాంత్ ఆత్మహత్య చేసుకుని మరణించాడా లేదా అతన్ని హత్య చేశారా? అని ప్రజలు కూడా ఇప్పుడు అడుగుతున్నారు. సిబిఐ దర్యాప్తు వివరాలు బయటకు రావాలని మేం కోరుకుంటున్నాం`` అని దేశ్ ముఖ్ మీడియాతో అనడం అనంతరం అభిమానులకు మీరా ట్వీట్ వేయడం విశేషం. మరోవైపు ఇన్ స్టా వేదికగా మీరా చోప్రా సెల్ఫ్ ప్రమోషన్ కూడా అదిరిపోతోంది. వేడెక్కించే ఫోటోషూట్లను షేర్ చేస్తూ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అభిమానులకు ట్వీట్ గాలం వేస్తోంది ఈ అమ్మడు.