Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ ఫ్యాన్ చంపేస్తాన‌‌ని బెదిరించాడు

By:  Tupaki Desk   |   3 Jun 2020 4:00 AM GMT
ఎన్టీఆర్ ఫ్యాన్ చంపేస్తాన‌‌ని బెదిరించాడు
X
సామాజిక మాధ్య‌మాల్లో అభిమానుల వీరంగం గురించి తెలిసిందే. ఒక్కోసారి సెలబ్రి‌టీ ఏమాత్రం నోరు జారినా దాని ఫ‌లితం అంతే తీవ్రంగా ఉంటుంది. ``చంపేస్తాం.. న‌రికేస్తాం!`` అనేంతవ‌ర‌కూ వెళుతుంది. నోటికి వ‌చ్చిన ప‌ద‌జాలం ఉప‌యోగించి బూతులు తిట్టేస్తుంటారు. తాజాగా బాలీవుడ్ ముద్దుగుమ్మ మీరా చోప్రాకి ఎన్టీఆర్ అభిమానుల నుంచి అలాంటి సెగ త‌గిలింది. మీరాకి తీవ్ర‌మైన వార్నింగులు వెళ్లాయి.

ఈ విష‌యాన్ని త‌నే స్వ‌యంగా సామాజిక మాధ్య‌మాల్లో స్క్రీన్ షాట్ల‌ను షేర్ చేసింది. త‌న‌ను ఎన్టీఆర్ అభిమానులు చంపేస్తామ‌ని వార్నింగ్ ఇచ్చార‌ని వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని సైబ‌రాబాద్ పోలీస్ కి ఫిర్యాదు చేస్తూ ఒక నోట్ ని సోష‌ల్ మీడియాలో షేర్ చేసింది. చంపేస్తామ‌ని .. మూక దాడికి పాల్ప‌డ‌తామ‌ని ఇష్టానుసారం తిట్టేసారు. ఇలాంటి వారి సోష‌ల్ మీడియా ఖాతాల్ని నిలిపివేయండి ప్లీజ్! అంటూ పోలీసుల‌కు మొర పెట్టుకుంది మీరా. అయితే అంత త‌ప్పు మీరా చోప్రా ఏం చేసింది? అంటే...?

అస‌లు త‌న‌కు ఎన్టీఆర్ ఎవ‌రో తెలియ‌దు! అంటూ వ్యాఖ్యానించ‌డ‌మే అందుకు కార‌ణం. సోష‌ల్ మీడియా చాటింగ్ లో త‌న ఫేవ‌రెట్ స్టార్ మ‌హేష్ అని చెప్పిన మీరా .. `బంగారం` కోస్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ గురించి చెబుతూ ఆయ‌నో సూప‌ర్ స్టార్.. గ్రేట్ హ్యూమ‌న్ బీయింగ్ అంటూ పొగిడేసింది. అలాగే మ‌హేష్ కి తాను వీరాభిమానిని అని చెప్పింది. ఇక ఎన్టీఆర్ ఎవ‌రో తెలీదు అన‌గానే.. అత‌డి అభిమానులు త‌న‌పై అస‌భ్య ప‌ద‌జాలంతో విరుచుకుప‌డ్డారు. దీంతో తీవ్రంగా హ‌ర్ట్ అయిన మీరా చోప్రా.. ఎన్టీఆర్ ఫ్యాన్స్ త‌నని ఎలాంటి ప‌దజాలంతో దూషించారో వెల్ల‌డించి ఆవేద‌న చెందింది. త‌న త‌ల్లిని ఉద్ధేశించి తిట్టిన‌వి స్క్రీన్ షాట్ల‌లో చూపించింది. ఇలాంటి అభిమానుల వ‌ల్ల ఎలా స‌క్సెస‌వుతావ్? అని తార‌క్ ని ప్ర‌శ్నించింది. మొత్తానికి ఫ్యాన్స్ అతి వ‌ల్ల ఇప్పుడు తార‌క్ క్ష‌మాప‌ణ చెప్పాల్సిన స‌న్నివేశం ఎదురైంది.