Begin typing your search above and press return to search.

పవన్ హీరోయిన్ అందాలు బంగారమే

By:  Tupaki Desk   |   11 Nov 2017 1:30 AM GMT
పవన్ హీరోయిన్ అందాలు బంగారమే
X
సోషల్ మీడియాను కనిపెట్టినోడికి ఏ స్థాయిలో లాభాలు వస్తున్నాయో చెప్పలేం కానీ.. వాడుకున్నోడికి వాడుకున్నంత అన్నట్టుగా ఉంది వ్యవహారం. ముఖ్యంగా సినీ సెలబ్రెటీలు అయితే ప్రస్తుతం వారి సినిమాలకు సగం ప్రమోషన్స్ ని సోషల్ మీడియా ద్వారానే చేస్తున్నారు. ఇక సినీ తారలకు అభిమానులకు మధ్య అంతరాన్ని కూడా తగ్గించే విషయంలో సోషల్ మీడియా బాగానే సక్సెస్ అయింది.

ముఖ్యంగా ముద్దుగుమ్మలు అయిన అందాల కథానాయికలకు మాత్రం సోషల్ మీడియా అనేది ఒక ఆయుధమే అని చెప్పాలి. ఛాన్సులు రాకుంటే ఏంటి.. అభిమానులనే ఆకర్షిస్తాం అంటూ.. సోషల్ మీడియాలో వారి అందాలను లిమిట్స్ లేకుండా సెక్సీగా చూపిస్తున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ - బంగారం సినిమాలో నటించిన హీరోయిన్ మీరా చోప్రా అందరికి గుర్తే ఉంటుంది. అమ్మడికి ఆ సినిమా బాగానే కలిసి వచ్చింది. తెలుగులో అంతగా అవకాశాలు రాకపోయినా కన్నడలో మాత్రం వరుస అవకాశాలను దక్కించుకొంది. ఇక ఆ తర్వాత వాన సినిమాలో అందంగా కనిపించింది.

అయితే రీసెంట్ గా మీరా చోప్రా ఎవరు ఊహించని విధంగా ఒక ఫొటోతో దర్శనం ఇచ్చింది. పింక్ లిప్స్ కి సెట్ అయ్యేలా పింక్ టీషర్ట్ వేసుకొని కాస్త క్లీవేజ్ టచ్ ఇచ్చింది. ఇక నడుము అందాలను దాచి సెక్సీ గా కూర్చొని చూస్తోన్న ఆమె చూపులను చూస్తుంటే ఎవ్వరైనా ఫిదా అవాల్సిందే. ప్రస్తుతం మీరా చోప్రా చేతిలో ఆఫర్స్ లేవు కానీ.. ఇలాంటి లుక్స్ తో మళ్లీ అవకాశాలను అందుకోవాలనే టార్గెట్ ను అందుకుంటుందో లేదో చూడాలి.