Begin typing your search above and press return to search.
ట్విట్టర్ ద్వారా 'సీఎం'తో మొరపెట్టుకున్న హీరోయిన్..
By: Tupaki Desk | 6 May 2020 5:43 PM ISTపవర్ స్టార్ నటించిన బంగారం సినిమాతో తెలుగుతెరకు పరిచయమయింది హీరోయిన్ మీరా చోప్రా. ఆ సినిమాలో ఆమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. తర్వాత సినీ నిర్మాత ఎమ్మెస్ రాజు దర్శకత్వం వహించినటువంటి "వాన" సినిమాలో తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికి గుర్తుండే పాత్ర పోషించింది. వాన సినిమాలో ముద్దుగుమ్మ మీరా చోప్రా తన నటనతో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అయితే తాజాగా మీరా చోప్రా తండ్రిని కొందరు వ్యక్తులు బెదిరించి అతడి నుంచి ఫోన్ దొంగిలించినట్లు మీరా చోప్రా తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం తన తల్లిదండ్రులతో కలిసి మీరా చోప్రా దేశ రాజధాని ఢిల్లీ నగరంలో నివాసం ఉంటోంది. అయితే మీరా చోప్రా తండ్రి తెల్లవారు జామున వాకింగ్ చేయడం కోసం బయటకు వెళ్ళాడట.
నిర్మానుష్య ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కత్తులతో బెదిరించి అతడి నుంచి ఖరీదైన మొబైల్ ఫోన్ దొంగిలించినట్లు తెలిపింది. అంతేగాక తన తండ్రిపై ఇంతటి ఘాతుకానికి పాల్పడిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలంటూ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. తన ట్విట్టర్ లో కంప్లైంట్ కి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ని ట్యాగ్ చేసింది అమ్మడు. దీంతో తాజాగా ఢిల్లీ పోలీసులు స్పందించి.. తన తండ్రిని బెదిరించి దొంగతనానికి పాల్పడిన వారిని త్వరలోనే పట్టుకొని చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఇదిలా ఉండగా తెలుగులో ఈ అమ్మడ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, కింగ్ నాగార్జున, నితిన్, తదితర స్టార్ హీరోలతో నటించింది. అంతేగాక తెలుగు తమిళ హిందీ భాషల్లో కలిపి 20కి పైగా సినిమాల్లో నటించిందట.