Begin typing your search above and press return to search.

మీనాక్షి మెరుపులు..యువ‌తలో అరుపులు!

By:  Tupaki Desk   |   3 July 2022 12:44 PM GMT
మీనాక్షి మెరుపులు..యువ‌తలో అరుపులు!
X
`ఇచట వాహ‌న‌ములు నిలుప‌రాదు` చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన హ‌ర్యానా బ్యూటీ మీనాక్షి చౌద‌రి టాలీవుడ్ కి సుప‌రిచిత‌మే. తొలి సినిమాతోనే యావ‌రేజ్ స‌క్సెస్ అందుకుంది. ఆవెంట‌నే మాస్ రాజా ర‌వితేజ స‌ర‌స‌న `ఖిలాడీ`లో ఛాన్స్ అందుకుంది. దీంతో అమ్మ‌డు గ్లామ‌ర్ ఎలివేష‌న్ లో ఒక్క‌సారిగా విశ్వ‌రూపం చూపించింది.

రాజాతో రొమాన్స్..చిట్టిపొట్టి దుస్తుల్లో హాట్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. మ‌రో ఛాన్స్ వ‌స్తుందో? రాదో? అవ‌కాశం ఉన్న‌ప్పుడే దున్నేయాలి అన్న తీరున `ఖిలాడీ` లో ఓ రేంజ్ లో చెల‌రేగింది. కానీ ఆశ్ర‌మంతా బూడిద‌లో పోసిన ప‌న్నీరే అయింది. సినిమా ప్లాప్ అవ్వ‌డం...అందులోనూ అమ్మ‌డి పాత్ర‌కి న‌ట‌న‌కు ఆస్కారం లేక‌పోవ‌డంతో తేలిపోయింది.

తొలి సినిమాతో సాధించిన ఇంప్రెష‌న్ మొత్తం చెడదీసుకుంది. త్రివిక్ర‌మ్ లాంటి ఉండ‌ద్దుల నోట ప్ర‌శంస‌లందుకున్నా...ఖిలాడీ ఫ‌లితం శూన్యం వైపు కి తొసేసింది. ప్ర‌స్తుతం యూత్ లో అటెన్ష‌న్ కోసం మ‌ళ్లీ ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టింది. కొత్త కొత్త ఫోటోల‌తో హాట్ టాపిక్ అవ్వ‌డానికి కొద్ది రోజులుగా ప్ర‌య‌త్నిస్తుంది. ఇన్ స్టా వేదిక‌గా అమ్మ‌డు టెంప్టింగ్ ఫోటోల‌తో మంట‌లు రేపుతోంది.

తాజాగా మ‌రోసారి అలాంటి ప్ర‌య‌త్నంతో నెటి జ‌నులు ముందుకొచ్చేసింది. గోల్డెన్ డ్రిప్ బ్యాక్‌డ్రాప్‌తో శాటిన్ రివీలింగ్ గౌను లో అమ్మ‌డు త‌ళుక్కున మెరిసింది. ప‌సుపు వ‌ర్ణంలో మిరుమిట్లు గొలిపే బ్యాక్ డ్రాప్ అమ్మ‌డి ప్లోర‌ల్ డ్రెస్ కి మ‌రింత వన్నే తీసుకొచ్చింది. నేల‌పై వ‌య్యారంగా వాలిపోయి క్యామ్ కి ఫోజులిచ్చింది.

క్లీవేజ్ స‌హా థై అందాలు అంతే హైలైట్ అవుతున్నాయి. ఈఫోటోని ఉద్దేశించి `లేజీ లమ్హే` అనే క్యాప్ష‌స‌న్ కూడా ఇచ్చింది. ఈ అంద‌మైన బ్యూటీని ఏస్ ఫోటోగ్రాఫర్ శ్రేయాన్స్ దున్గర్వాల్ క్యాప్చ‌ర్ చేయ‌గా ..అవి ఇప్పుడు నెట్టింట లీకై యువ‌త‌లో అగ్గిరాజేస్తున్నాయి. నెటి జ‌నులు హాట్ కామెంట్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

ఈ బ్యూటీ అందంలోనే కాదండోయ్..చ‌ద‌వులోనూ అంతే ముందుంటుంది. ఇటీవ‌లే ఈ 25 ఏళ్ల బ్యూటీ డెంటల్ సర్జరీలో బ్యాచిలర్ డిగ్రీని కూడా పూర్తి చేసింది. కానీ డాక్ట‌ర్ కాకుండా యాక్ట‌ర్ అవ్వాల‌ని మ్యాక‌ప్ వేసుకుని ఇటు వ‌చ్చేసింది. ప్ర‌స్తుతం ఈభామ `హిట్ ది సెకెండ్ కేస్` లో హీరోయిన్ గా న‌టిస్తోంది. అలాగే `కోలై `అనే సినిమాతో కోలీవుడ్ లోనూ లాంచ్ అవుతోంది.