Begin typing your search above and press return to search.

ఆద‌మ‌రిస్తే అంతేగా మీనాక్షీ! ఇంకేదైనా ఉందా?

By:  Tupaki Desk   |   9 Oct 2021 12:30 AM GMT
ఆద‌మ‌రిస్తే అంతేగా మీనాక్షీ! ఇంకేదైనా ఉందా?
X
హ‌రియాణాకు చెందిన మోడ‌ల్ కం న‌టి మీనాక్షి చౌద‌రి టాలీవుడ్ లోకి దూసుకొస్తున్న సంగ‌తి తెలిసిందే. త‌న‌దైన అందం స్ట్రైకింగ్ లుక్ తో ఈ బ్యూటీ క‌ట్టి ప‌డేస్తోంది. ఇటీవ‌ల‌ తెలుగు - త‌మిళ చిత్రాల్లో వ‌రుస‌గా ఆఫ‌ర్లు అందుకుంటోంది. తెలుగులో సుశాంత్ స‌ర‌స‌న‌ `ఇచ‌ట వాహ‌నాములు నిలుప‌రాదు` చిత్రంతో హీరోయిన్ గా ప‌రిచ‌య‌మైంది. తొలి సినిమా రిలీజ్ కు ముందే మీనాక్షికి అసాధార‌ణ పాపులారిటీ ద‌క్కింది.

మీనాక్షి అందాల పోటీల నుంచి వ‌చ్చిన న‌టి. అందువ‌ల్ల త‌న క్రేజ్ స్కైలో ఉంది. రెండో ప్ర‌య‌త్నంగా ఈ భామ మాస్ రాజా ర‌వితేజ స‌ర‌స‌న `ఖిలాడీలో`నూ న‌టిస్తోంది. అలాగే యంగ్ హీరో అడ‌వి శేష్‌ తో `హిట్-2` లో కూడా న‌టిస్తుంది. తొలి సినిమా స‌క్సెస్ ఫెయిల్యూర్ సంగ‌తి ప‌క్క‌న బెడితే ఇంకా రెండు చిత్రాలు చేతిలో ఉండ‌టం మీనాక్షి చౌద‌రికి కలిసొచ్చే అంశం. అందుకే ఈ బ్యూటీ తెలుగు భాష‌ను నేర్చుకుంటోంద‌ని తెలిసింది.

మొద‌టి సినిమాలో త‌న పాత్ర‌కు తానే తెలుగు డ‌బ్బింగ్ చెప్పుకుంది. దీంతో మీనాక్షి భాష నేర్చుకునే విష‌యంలో ఎంత ఫ్యాష‌న్ తో ఉందో అర్ధ‌మ‌వుతోంది. అయితే తెలుగు నేర్చుకోవడానికి మీనాక్షి ఎంత‌గా శ్ర‌మించిందో ఓ ఇంట‌ర్వ్యూలో వెల్ల‌డించింది.

తెలుగు నేర్చుకోవ‌డం మొద‌ట్లో చాలా క‌ష్ట‌మైంద‌ని దీంతో ఆ భాష‌ను స‌వాల్ గా తీసుకుని నేర్చుకున్న‌ట్లు తెలిపింది. పంజాబ్.. హ‌ర్యానా లో పుట్టి పెర‌గ‌డం.. అటుపై ముంబైలో ఉండ‌టం కార‌ణంగా స్థానిక భాష‌లు..ఇంగ్లీష్ త‌ప్ప ఇంకే భాష‌లు రావు అంది. హైద‌రాబాద్ వ‌చ్చిన త‌ర్వాత నాకు తెలిసిన భాష‌లు మాట్లాడితే ప‌న‌వ్వ‌ద‌ని అర్ధ‌మైంది. నా చుట్టూ ఉన్న వారు కూడా తెలుగు వాళ్లు కావడంతో ఇంకా ఇబ్బందిగా మారింది.. అని తెలిపింది.

దీంతో భాష‌ను నేర్చుకోవాల‌ని బ‌లంగా సంక‌ల్పించి ముందుకు క‌దిలాను. నా సినిమా డైలాగుల‌ను ముందు రోజు రాత్రి హిందీలోకి మార్చుకుని త‌ర్వాత స్థానిక భాష‌లోకి తెలిసిన వాళ్ల ద్వారా త‌ర్జుమా చేసి చెప్పేదాన్ని. అలా తెలుగు కొంచెం అర్ధ‌మైంది. రెండ‌వ సినిమాకి ఆ ప్రాక్టీస్ ఎంతో ప‌నికొచ్చిందని తెలిపింది. మీనాక్షి తాజాగా షేర్ చేసిన స్ట‌న్నింగ్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ బ్యూటీ బ్లూ జీన్స్ .. బ్లాక్ టాప్ ధ‌రించి దుమ్ము రేపింది. షార్ట్ హెయిర్.. మేకప్ లెస్ లుక్ ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుండ‌గా ఆ మెడ‌లో గోల్డ్ పెండెంట్ మ‌రింత ఆక‌ర్ష‌ణ‌ను పెంచింది. ప్ర‌స్తుతం ఈ ఫోటో వైర‌ల్ గా మారింది.