Begin typing your search above and press return to search.

'సలార్' లో ఖిలాడి బ్యూటీ..?

By:  Tupaki Desk   |   4 Oct 2021 5:30 AM GMT
సలార్ లో ఖిలాడి బ్యూటీ..?
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ - 'కేజీయఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ''సలార్''. హోంబలే ఫిలింస్ బ్యానర్ పై విజయ్ కిరగందూర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇందులో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో స్టార్ క్యాస్టింగ్ - అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానంతో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సెకండ్ హీరోయిన్ పాత్రకు అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఈ నేపథ్యంలో 'స‌లార్' సినిమాలో సెకండ్ హీరోయిన్ గా ముద్దుగుమ్మ మీనాక్షి చౌద‌రి ని ఎంపిక చేశారని టాక్ వినిపిస్తోంది. ఒకటీ అర మ్యూజిక్ వీడియోస్ చేసిన మీనాక్షీ.. ఇటీవలే విడుదలైన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అక్కినేని హీరో సుశాంత్ తో కలిసి రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ.. ఆ సినిమా రిలీజ్ అవ్వకముందే అందరి దృష్టిని ఆకర్షించి క్రేజీ ఆఫర్ అందుకుంది. మాస్ మహారాజా రవితేజ తో జోడీ కట్టే ఛాన్స్ కొట్టేసింది.

'రాక్షసుడు' ఫేమ్ రమేష్‌ వర్మ దర్శకత్వంలో రవితేజ హీరోగా 'ఖిలాడి' అనే హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో డింపుల్ హయాతి ఒక హీరోయిన్ కాగా.. మరో హీరోయిన్ గా మీనాక్షి చౌద‌రి నటిస్తోంది. ఇప్పటికే షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ మూవీ రిలీజ్ కాకముందే ఈ హర్యానా బ్యూటీ.. ఇప్పుడు డార్లింగ్ ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం దక్కించుకుందని ప్రచారం జరుగుతోంది. ఇదే కనుక నిజమైతే అమ్మడి కెరీర్ లో ఇదొక టర్నింగ్ పాయింట్ అవుతుంది. దీని మీద క్లారిటీ రావాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

కాగా, పాన్ ఇండియా స్టార్ - డైరెక్టర్ కలిసి వర్క్ చేస్తున్న 'సలార్' మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఫస్ట్ లుక్ కు విశేష స్పందన లభించింది. గ్యాంగ్ స్టర్ తరహా లుక్ లో ప్రభాస్ మోస్ట్ వైలెంట్ గా కనిపించి ఆకట్టుకున్నాడు. అక్టోబర్ 23న డార్లింగ్ పుట్టినరోజు కావడంతో మరో న్యూ అప్డేట్ వస్తుందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి మేకర్స్ మరో సర్ప్రైజ్ ప్లాన్ చేస్తారేమో లేదో చూడాలి. రవి బస్రుర్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ద్వితీయార్థంలో ప్రేక్షకుల ముందుకు రానుంది.