Begin typing your search above and press return to search.

బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మీనా?

By:  Tupaki Desk   |   7 May 2021 12:30 AM GMT
బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో మీనా?
X
ఒక వైపున బాలకృష్ణ కథనాయకుడిగా బోయపాటి శ్రీను 'అఖండ' సినిమా చేస్తున్నాడు. మరో వైపున బాలకృష్ణ తదుపరి సినిమాకి సంబంధించిన సన్నాహాలు చకచకా జరిగిపోతున్నాయి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఈ సినిమా రూపొందనుంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందనుందని గోపీచంద్ మలినేని చెప్పిన దగ్గర నుంచి, అంచనాలు ఒక రేంజ్ లో పెరిగిపోతున్నాయి. ఇంతవరకూ తెరపై చూసినవాటికి భిన్నంగా ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ ఉంటాయని అంటున్నారు. బాలకృష్ణ బర్త్ డే సందర్భంగా జూన్ 10న ఈ సినిమాను లాంచ్ చేయనున్నారని టాక్.

ఇక ఈ సినిమాలో కథానాయికలు ఎవరనే విషయంపై చాలామంది పేర్లు వినిపిస్తున్నాయి. తాజాగా తెరపైకి శ్రుతి హాసన్ పేరు వచ్చింది. 'బలుపు' .. 'క్రాక్' సెంటిమెంట్ కారణంగా గోపీచంద్ మలినేని శ్రుతి హాసన్ ను ఒప్పించే పనిలో ఉన్నాడని అంటున్నారు. ఒకవేళ శ్రుతి డేట్స్ కుదరకపోతే, నభా నటేశ్ ను రంగంలోకి దింపాలనే ఆలోచన కూడా చేస్తున్నారట. ఇక ఈ సినిమాలో బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఒకటి ఇంట్రెస్టింగ్ గా ఉంటుందట. ఆ ఎపిసోడ్ లో ఆయన సరసన మీనా కనిపించనుందని చెప్పుకుంటున్నారు.

గతంలో బాలకృష్ణ - మీనా జోడీగా తెరపై బాగానే సందడి చేసింది. మళ్లీ ఇప్పుడు ఈ ఇద్దరూ తెరపై కలిసి కనిపించే అవకాశం ఉందని అంటున్నారు. ఈ సినిమాలోని బాలకృష్ణ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఫ్యాక్షన్ నేపథ్యంలో నడుస్తుందట. అప్పుడు ఆయన భార్య పాత్రలో మీనా కనిపించనుందని చెబుతున్నారు. ఇటీవల కాలంలో మీనా తెలుగు .. తమిళ .. మలయాళ సినిమాల్లో ముఖ్యమైన పాత్రలను చేసుకుంటూ వస్తోంది. బాలకృష్ణ సినిమాలో ఆమె ఎంపిక నిజమైతే, 'దృశ్యం 2' తరువాత చేసే సినిమా ఇదే అవుతుంది.