Begin typing your search above and press return to search.

దృశ్యం 2 .. ఆన్ లొకేష‌న్ కొలీగ్ తో మీనా ఫ‌న్

By:  Tupaki Desk   |   16 April 2021 3:30 AM GMT
దృశ్యం 2 .. ఆన్ లొకేష‌న్ కొలీగ్ తో మీనా ఫ‌న్
X
మ‌ల‌యాళ బ్లాక్ బ‌స్ట‌ర్ `దృశ్యం 2` తెలుగులో విక్ట‌రీ వెంక‌టేష్- మీనా ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీ `దృశ్యం`కి సీక్వెల్ ఇది. తొలి భాగంలో న‌టించిన తార‌లంతా రెండో భాగంలోనూ ప‌ని చేస్తున్నారు. వెంకీ స‌తీమ‌ణిగా మీనా న‌టిస్తుండ‌గా.. కూతుళ్ల పాత్ర‌లు య‌థావిధిగా తెర‌పై క‌నిపిస్తాయి. కృతిక ఈ చిత్రంలో వెంకీ కుమార్తెగా న‌టిస్తున్నారు. తాజాగా దృశ్యం 2 షూటింగ్ టాకీ పార్ట్ పూర్త‌యింది.

ఇక ఆన్ లొకేష‌న్ క‌థానాయిక మీనా ఫ‌న్నీ ఎక్స్ ప్రెష‌న్ కి సంబంధించిన ఓ ఫోటో వైర‌ల్ గా మారింది. ఈ చిత్రంలో లేడీ పోలీసాఫీస‌ర్ గా న‌టిస్తున్న న‌టీమ‌ణితో మీనా ఎంతో జోవియ‌ల్ గా సెట్స్ లో క‌లిసిపోయిన తీరు ఆస‌క్తిని క‌లిగించింది. ఆన్ లొకేష‌న్ మీనా ఎంతో జోవియ‌ల్ గా ఉంటారు. ఆ ఎక్స్ ప్రెష‌న్ ఎంతో ఫ‌న్నీగా ఉందంటూ అభిమానులు వ్యాఖ్యానిస్తున్నారు.

క్లాసిక్ డేస్ లో ఆన్ లొకేష‌న్ ఎంతో గొప్ప సాంప్ర‌దాయం ఉండేద‌ని అంద‌రూ ఒక కుటుంబ‌లా క‌లిసిపోయి ప‌ని చేసేవార‌ని చాలామంది సీనియ‌ర్ న‌టీమణులు చెబుతుంటారు. అలాంటి స‌న్నివేశ‌మే దృశ్యం 2 సెట్స్ లోనూ కొన‌సాగింద‌ని అర్థ‌మ‌వుతోంది. తాజాగా చిత్రీక‌ర‌ణ సాంతం పూర్త‌యిన సంద‌ర్భంగా దృశ్యం 2 మొత్తం టీమ్ కెమెరాకు ఫోజులిచ్చింది. ఆ ఫోటోలు ప్ర‌స్తుతం అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి.

మ‌ర్డ‌ర్ మిస్ట‌రీ.. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ జోనర్ లో తెర‌కెక్కిన‌ ఈ సీక్వెల్ సినిమా ఇప్ప‌టికే మ‌ల‌యాళంలో పెద్ద విజ‌యం సాధించింది. తెలుగులోనూ అంతే గ్రిప్పింగ్ గా తెర‌కెక్కింద‌ని చిత్ర‌బృందం చెబుతోంది.