Begin typing your search above and press return to search.

సంక్రాంతి రేసులో మీడియం రేంజ్ సినిమాలు

By:  Tupaki Desk   |   2 Jan 2022 9:17 AM GMT
సంక్రాంతి రేసులో మీడియం రేంజ్ సినిమాలు
X
పాన్ ఇండియా చిత్రం `ఆర్.ఆర్.ఆర్` రిలీజ్ వాయిదా ప‌రిశ్ర‌మలో ఇత‌ర రిలీజ్ ల‌కు సంక‌టంగా మారిన సంగ‌తి తెలిసిందే. ఉరుమెల్లి మెరుపుపై ప‌డిన చందంగా ఇప్పుడు ఒక్కో సినిమా సైడివ్వాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది. పాన్ ఇండియా మూవీ ఆర్.ఆర్.ఆర్ సంక్రాంతి రేసు నుంచి త‌ప్పుకోవ‌డంతో మీడియం బడ్జెట్ సినిమాల‌కు కొంత‌వ‌ర‌కూ లైన్ క్లియ‌ర్ అయింది. ఈ సంక్రాంతికి `భీమ్లా నాయ‌క్` చిత్రం కూడా రిలీజ్ కాక‌పోవ‌డం క‌లిసొస్తోంది. అలాగే డార్లింగ్ ప్ర‌భాస్ న‌టిస్తోన్నమ‌రో పాన్ ఇండియా చిత్రం `రాధేశ్యామ్` కూడా జ‌న‌వ‌రి 14 రిలీజ్ పైనా సందేహాలున్నాయ‌న్న గుస‌గుస‌లు వ‌చ్చినా ఇంత‌కుముందు రిలీజ్ ని ఖాయం చేశారు. దీంతో చిన్న‌మీడియం బ‌డ్జెట్ సినిమాల రిలీజ్ కి సంక్రాంతి ఒక గొప్ప‌ వేదిక అయింది. ఇప్ప‌టికే సితార ఎంట‌న్ టైన్ మెంట్స్ లో నిర్మాణం జ‌రుగుతోన్న `డీజేటిల్లు`

ఆశ్చర్యకరమైన పరిణామంలో రౌడీ బాయ్స్ నిర్మాతలు ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. చిత్ర కథానాయకుడు ఆశిష్ రెడ్డి రగ్డ్ లుక్ లో ఉన్న పోస్టర్ ని విడుద‌ల చేసి ఈ ప్రకటన చేశారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి శ్రీ హర్ష కొనుగంటి దర్శకత్వంలో ఆదిత్య మ్యూజిక్‌తో కలిసి దిల్ రాజు మరియు శిరీష్ నిర్మించిన ఈ సినిమాతో అరంగేట్రం చేస్తున్నాడు. యూత్‌ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న రౌడీ బాయ్స్‌ను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌పై శ్రీమతి అనిత సమర్పిస్తున్నారు. ఈ సినిమా జనవరి 14 లేదా 15న ప్రేక్షకుల ముందుకు రానుందని స‌మాచారం. అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో సహిదేవ్ విక్రమ్- కార్తీక్ రత్నం- తేజ్ కూరపాటి కోమలి ప్రసాద్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.

7డేస్ 6 నైట్స్ సంక్రాంతి రేస్ లో

సంక్రాంతి సీజన్ లో ప్రతిష్టాత్మకమైన సుమంత్ ఆర్ట్స్ బ్యానర్ లో రూపొందించిన రొమాంటిక్ కామెడీ మూవీ 7డేస్ 6నైట్స్ సంక్రాంతి రేసులో విడుద‌ల‌వుతోంది. ఎంఎస్ రాజు ఈ చిత్రాన్ని 14 జనవరి 2022న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. త్వరలో తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. మనసంతా నువ్వే- నువ్వొస్తానంటే నేనొద్దంటానా- వర్షం - ఒక్కడు వంటి సంక్రాంతి బ్లాక్ బస్టర్ ల‌తో సంక్రాంతి రాజుగా ఎం.ఎస్.రాజు పాపుల‌ర్. ఇటీవలి థ్రిల్లింగ్ హిట్ `డర్టీ హరి`తో రాజుగారు స‌త్తా చాటారు. ఇప్పుడు మ‌ళ్లీ 7డేస్ 6 నైట్స్ తో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నారు.

సూప‌ర్ మ‌చ్చి సంక్రాంతి బ‌రిలో

సంక్రాంతి బ‌రిలోకి మ‌రో చిన్న సినిమా వ‌చ్చి చేరింది. కళ్యాణ్ దేవ్- పులి వాసు- రిజ్వాన్ ఎంటర్ టైన్ మెంట్స్ కాంబినేష‌న్ మూవీ `సూపర్ మచ్చి` జనవరి 14న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. విజేత చిత్రంతో తెరంగేట్రం చేసిన మెగాస్టార్ చిరంజీవి అల్లుడు కళ్యాణ్ దేవ్ తదుపరి చిత్రం సూపర్ మచ్చిలో కనిపించనున్నాడు. పులి వాసు దర్శకత్వం వహించిన చిత్ర‌మిది. రచితా రామ్ కథానాయికగా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ప్రకటన పోస్టర్ లో లీడ్ పెయిర్ సూపర్ స్టైలిష్ అవతార్ లో కనిపించారు. దీపావళి కానుకగా విడుదలైన ఈ సినిమా టీజర్ ఆకట్టుకుంది. ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. నరేష్ వికె- రాజేంద్ర ప్రసాద్- పోసాని కృష్ణ ముర‌ళి తదిత‌రులు న‌టించారు.