Begin typing your search above and press return to search.
అతి ఆలోచనల నుంచి అలా బయటపడిందట!
By: Tupaki Desk | 12 Dec 2021 3:00 PM ISTసైఫ్ అలీఖాన్ వారసురాలిగా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన సారా అలీఖాన్ కెరీర్ వండర్ ఫుల్ గా సాగిపోతున్న సంగతి తెలిసిందే. ఇక సారా ఎంతో బ్యాలెన్స్ డ్ గా ఒదిగి మాట్లాడుతోంది. అందరికి ఆమెలో ఎక్కువగా నచ్చేది డౌన్ టు ఎర్త్ క్వాలిటీ. ఇటీవలే మరోసారి ఆ లక్షణాన్ని బయటపెట్టింది. ఓ ఈవెంట్ కి హాజరై తిరిగి తన కార్ ఎక్కుతోన్న సమయంలో ఓ ఫోటో గ్రాఫర్ కి చేదు అనుభవం ఎదురైంది. సారా సెక్యురిటీ సిబ్బంది ఆ ఫోటోగ్రాపర్ ని పక్కకి నెట్టేసారు. ఈ క్రమంలో అతను కింద పడిపోయాడు.
ఈ సన్నివేశాన్ని సారా ఓవైపు గమనిస్తూనే ఉంది. సరిగ్గా కారు ఎక్కుతోన్న సమయంలో ఫోటో గ్రాపర్ ని ఎందుకు నెట్టారని సెక్యురిటీని నిలదీసింది. అలాంటిదేమి జరగలేదని సెక్యురిటీ చెబుతున్నా..వాళ్లతో వాగ్వివాదానికి దిగింది. తప్పంతా సెక్యురిటీదేనని.. అందుకు అందరి తరుపు తానే స్వయంగా క్షమాపణలు కోరింది. ఈ వార్త బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. సారా మంచి మనసు ఎంత గొప్పదో మరోసారి బయట పడింది. అలాగే సారాకి ఓవర్ థింకింగ్ కూడా ఉండేదిట. ఆ కారణంగా చాలా ఇబ్బందులకు గురైందని తెలిపింది. సినిమాల్లోకి రాకముందు ఏ విషయంపైనైనా అతిగా ఆలోచించేదట.
ఆ కారణంగా డిప్రెషన్ కి గురయ్యేదట. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అధిగమించినట్లు తెలిపింది. అదుకు మెడిటేషన్ ఎంతో ఉపయోగపడిందని తెలిపింది. ఇక సారా అలీఖాన్ సినిమాల విషయానికి వస్తే `అట్రాంగిరే` లో నటిస్తోంది. ఇందులో అక్షయ్ కుమార్.. ధనుష్ హీరోలగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఆనంద్ ఎల్. రాయ్ దర్శకత్వం వహిస్తున్నారు. డిసెంబర్ 24న చిత్రం ప్రేక్షకుల ముందుకురానుంది. సారా అలీఖన్ డ్రగ్ అడిక్షన్ గురించి ఇంతకుముందు ఎన్.సి.బి విచారించిన సంగతి తెలిసిందే. అన్నిటి నుంచి బయటపడేందుకు మెడిటేషన్ .. యోగా లాంటి పురాతన విద్యలు ఎంతగానో సహకరిస్తున్నాయి.