Begin typing your search above and press return to search.

నిర్మాతకు తెలీదంట.. భలే వండారే!!

By:  Tupaki Desk   |   27 March 2018 4:52 AM GMT
నిర్మాతకు తెలీదంట.. భలే వండారే!!
X
విలన్ ఎంత బలంగా ఉంటే.. హీరో పాత్ర అంతగా ఎక్కువగా పండుతుంది. ఇది సినిమాల్లో మేకర్స్ పాటించే సూత్రం. కానీ ఒకళ్లను ఎంత పైకి ఎత్తాలంటే.. ఇంకోళ్లను అంత కిందకు లాగేయాలి. అలాగే ఒకరి మీద జాలి కురిపించేయాలంటే.. ఇంకొకరి నెత్తిన బండరాళ్లు వేసేయాలి . ఇప్పుడు మీడియా.. సోషల్ మీడియా వాళ్లు పఠిస్తున్న మంత్రాలు ఇవి.

రీసెంట్ గా #RRR అంటూ పెద్ద అనౌన్స్ మెంట్ వచ్చింది. సింపుల్ గా రాజమౌళి- రామ్ చరణ్ - రామారావు అంటూ పేర్లు.. డీవీవీ ఎంటర్టెయిన్మెంట్స్ బ్యానర్ తప్ప.. వీడియోలో మరేమీ లేకుండా డిజైన్ చేశాడు జక్కన్న. అభిమానులు కూడా సంబరాలు చేసుకున్నారు. అయితే.. ఓ మీడియాకు మాత్రం ఇప్పుడు అర్జంటుగా నిర్మాత మీద జాలి చూపించేయాలనే ఆలోచన మొదలైంది. అంతే.. అసలు ఈ వీడియో గురించి ఆ నిర్మాతకు కనీసమాత్రం ఇన్ఫర్మేషన్ లేదని.. మొత్తం అంతా రాజమౌళి చూసుకున్నాడని.. ఓ మాంచి మసాలాను ప్రిపేర్ చేసి వదిలేశారు. 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాతపై తెగ జాలి చూపించాలనే ఆత్రంతో.. రాజమౌళి మీద రాళ్లేయడం మొదలుపెట్టారు.

ఇందులో ఎంత నిజం ఉందనే విషయం ఎవరూ చెప్పలేరు. బహుశా వీడియో రిలీజ్ చేసే టైం ముందుగా చెప్పలేదన్నది వీరి వాదన. అయితే.. 200 కోట్లు పెట్టి సినిమా తీస్తున్న నిర్మాత.. ఆయనకు ఏం చెప్పలేదు అంటున్నారు.. బాగానే ఉంది కానీ.. ఇంతకీ ఆ నిర్మాత 200 కోట్లు పెట్టి దేశసేవ ఏమైనా చేస్తున్నారా.. లేదుకదా సినిమా తీసి వ్యాపారం చేయడమే కదా అన్నది నెటిజన్ల వాదన. ఆ ముగ్గురి పేర్లు చెప్పి బిజినెస్ చేసుకోవడం తేలిక కాబట్టి తీస్తున్నాడు అంతే కదా అంటున్నారు రాజమౌళి ఫాలోయర్స్. ఒకవేళ అదంతా నిజమే అయినా.. రాజమౌళి స్టైల్ గురించి తెలిసే నిర్మాణం వహిస్తాడు కదా అంటున్నారు. అయినా కందకు లేని దురద.. వీళ్లకెందుకు అన్న పాయింట్ కు ఆన్సర్ ఇచ్చేదెవరో?