Begin typing your search above and press return to search.
`మాయామాల్`లో ఏముంది?
By: Tupaki Desk | 26 July 2016 4:08 AM GMTహారర్ సినిమాలకు మంచి క్రేజ్ వుంది. వాటిని పక్కాగా తెరకెక్కిస్తే... బాక్సాఫీస్ ను బద్దలు కొట్టడం ఖాయం. తాజాగా `హోరా హోరీ` ఫేమ్ దిలీప్ - అంతకు ముందు ఆ తరువాత హీరోయిన్ ఇషా జంటగా తెరకెక్కుతోంది ‘మాయామాల్’. గ్రీష్మ ఆర్ట్స్ సమర్పణలో వైష్ణవి మూవీ మేకర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న ఈ చిత్రంలో సోనియా - దీక్షాపంత్ - పృథ్వీ - నాగినీడు తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు. గోవింద్ లాలం దర్శకత్వంలో తెరకెక్కుతోంది.
చాలా కాలం తరువాత గుంటూరు అమ్మాయి ఇషా ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది. అలాగే హాటీ గాళ్ దీక్షాపంత్ కూడా నటిస్తోంది. ఓ మాల్ లో జరిగే లవ్ అండ్ హారర్ కామెడీతో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆ మాల్ లో ఇంతలా హారర్ తో హడిలిపోయే అంశాలు ఏమున్నాయనేది తెరమీద చూడాలి అంటున్నారు నిర్మాతలు యార్లగడ్డ జీవన్‌కుమార్ - కె.వి.హరికృష్ణ - చందు ముప్పాళ్ల - నల్లం శ్రీనివాస్ లు.
చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రంలో పృథ్వీ - షకలక శంకర్ - తాగుబోతు రమేష్ లు చేసే కామెడీ హిలేరియస్ గా వుంటుంది. థియేటర్లోకి అడుగు పెట్టిన ప్రతి ఒక్కరూ నవ్వుతారు. సాయి కార్తీక్ సంగీతం అందించిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ను త్వరలోనే విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. వీలైనంత త్వరగా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారంట నిర్మాతలు. చూద్దాం.. ఈ మాయామాల్ ఏమాత్రం ప్రేక్షకులను భయపెడుతుందో?!