Begin typing your search above and press return to search.
మోడీ కన్నీళ్లు: ఆస్కార్ ఇవ్వాలంటున్న వర్మ
By: Tupaki Desk | 22 May 2021 6:00 PM ISTప్రధాని మోడీ ఇటీవల వారణాసి డాక్టర్లు, వైద్య సిబ్బందితో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్న సంగతి తెలిసిందే. దేశంలో కోవిడ్ -19 మరణాల గురించి మాట్లాడుతున్నప్పుడు ప్రధాని నరేంద్ర మోడీ చాలా ఉద్వేగానికి లోనయ్యారు. ఒకానొక సమయంలో ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పిస్తూ కన్నీళ్లు పెట్టుకొని తన ప్రసంగాన్ని ముందుకు కొనసాగించలేకపోయారు.
ప్రధాని మోడీ కంటతడి పెట్టుకోవడంపై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. నెటిజన్లు తలోరకంగా స్పందిస్తున్నారు.మోడీ భావోద్వేగంపై నెటిజన్లు సృజనాత్మకంగా పోస్టులు పెడుతున్నారు.
ఇంతటి సువర్ణ అవకాశాన్ని వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ వదులుకుంటాడా? సెటైర్ వేయనే వేశాడు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మోడీ కన్నీళ్లపై ఒక్క వీడియోతో సెటైర్ వేశాడు. పిఎం మోడీ కన్నీళ్లు పెడుతున్న వీడియో తీసుకొని ‘ఉత్తమ ఆస్కార్ ప్రదర్శనగా' కామెంట్ చేశాడు. ఆస్కార్ అవార్డులను మార్ఫింగ్ చేసిన వర్మ.. మోడీ తలకాయను అంటించి 'బెస్ట్ ఆస్కార్ అవార్డ్ ' నటనకు తీసుకుంటున్న మోడీ వీడియోను రూపొందిచి షేర్ చేశాడు. వీడియోను ఆర్జీవీ పోస్ట్ చేయగా వైరల్ అయ్యింది.
మోడీ కన్నీళ్లు పెడుతుండగా.. హాలీవుడ్ నటుడు లియోనార్డో డికాప్రియో షాకింగ్ అయ్యి చూస్తున్నట్టుగా వీడియోలో ఉంది. ఇక మోడీ ఆస్కార్ అవార్డు తీసుకుంటుంటే చప్పట్లు కొడుతున్న ప్రముఖ జర్నలిస్టు అర్నాబో గోస్వామిని వీడియోలో చూపించి వర్మ వేసిన సెటైర్లు మామూలుగా లేదు.
https://twitter.com/RGVzoomin/status/1396003387536146436

దేశంలో సెకండ్ వేవ్ ను నిర్వహించడంలో విఫలమయ్యాడని ప్రధాని మోడీపై అంతటా విమర్శలు వస్తున్నాయి. ఇది భారీ సంక్షోభానికి దారితీసింది. దాని ఫలితంగా గత రెండు నెలల్లో మోడీ గ్రాఫ్ తీవ్రంగా పడిపోయిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.