Begin typing your search above and press return to search.

కుస్తీకి రెడీ అవుతున్న మాస్ రాజా - విష్ణు విశాల్

By:  Tupaki Desk   |   5 April 2022 1:30 PM GMT
కుస్తీకి రెడీ అవుతున్న మాస్ రాజా - విష్ణు విశాల్
X
విభిన్న‌మైన చిత్రాల‌తో త‌న హీరోగా త‌న‌కంటూ ప్ర‌త్యేక‌త‌ను చాగుకుంటున్నారు త‌మిళ‌ యంగ్ హీరో విష్ణు విశాల్. ఆయ‌న‌తో మ‌న మాస్ మ‌హారాజా ర‌వితేజ చేతులు క‌లిపిన విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల విబిన్న‌మైన క‌థాంశంతో రూపొందిన విష్ణు విశాల్ చిత్రం `ఎఫ్ ఐ ఆర్‌` కు హీరో ర‌వితేజ తెలుగులో స‌హ నిర్మాత‌గా వ్య‌వ‌హ‌రించారు. ఈ చిత్రం మంచి విజ‌యాన్ని సాధించ‌డంతో అదే బంధాన్ని కొన‌సాగిస్తూ విష్ణు విశాల్ న‌టిస్తున్న స్పోర్ట్స్ డ్రామా కు కూడా స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

విష్ణు విశాల్ న‌టిస్తున్న స్పోర్ట్స్ డ్రామా `గ‌ట్టా కుస్తీ`. చెల్లా అయ్య‌వు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రాన్ని తెలుగులో `మ‌ట్టి కుస్తీ` పేరుతో రిలీజ్ చేస్తున్నారు. విష్ణు విశాల్ స్టూడియోస్, ఆర్ టీ టీమ్ వ‌ర్క్స్ బ్యాన‌ర్ పై ర‌వితేజ‌, విష్ణు విశాల్ తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మంగ‌ళ‌వారం ఈ చిత్ర మోష‌న్ పోస్ట‌ర్ ని రిలీజ్ చేసిన మేక‌ర్స్ ఇదే సంద‌ర్భంగా ఈ మూవీ త‌మిళ‌, తెలుగు టైటిల్ ని కూడా ప్ర‌క‌టించేశారు. ఇదొక బై లింగ్వ‌ల్ మూవీ. తెలుగు మోష‌న్ పోస్ట‌ర్ ని హీరో మాస్ మ‌హారాజా ర‌వితేజ సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేశారు.

స్పోర్ట్స్ ప్ర‌ధానంగా సాగే చిత్రాలంటే ఎప్పుడూ ఇష్ట‌ప‌డ‌తాన‌ని, ఎంట‌ర్ టైన్ మెంట్ తో సాగే స్పోర్ట్స్ డ్రామాకు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నందుకు ఆనందంగా వుంద‌ని, ఇదుగో `మ‌ట్టి కుస్తీ` మోష‌న్ పోస్ట‌ర్‌` అంటూ ర‌వితేజ కామెంట్ చేశారు. ఈ చిత్రంలో స్ర‌వంతి సాయినాథ్ హీరోయిన్ గా న‌టిస్తోంది. విష్ణు విశాల్ కుస్తీ ప‌ట్టే మ‌ల్ల‌యోధుడి (రెజ్ల‌ర్‌) పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. టైటిల్ మోష‌న్ పోస్ట‌ర్ మంగ‌ళ వాయిద్యాల‌తో మొద‌లైంది. మ‌ధ్య‌లో పెళ్లి ప‌త్రిక‌.. బ్ర‌హ్మ‌ముడి... ఆ త‌రువాత కుస్తీ గ్రౌండ్ ని చూపింపించారు. పెళ్లికి - కుస్తీకి వున్న సంబంధం ఏంట‌న్న‌ది మోష‌న్ పోస్ట‌ర్ లో ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ప్రేమించిన అమ్మాయిని పెళ్లీ చేసుకోవ‌డం కోసం హీరో కుస్తీ రింగ్ లోకి దిగాడా? అన్న‌ది ఆస‌క్తిక‌రంగా వుంది.

ఇక స్పోర్ట్స్ డ్రామా నేప‌థ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు ర‌వితేజ కూడా యాడ్ అవ్వ‌డంతో ఈ చిత్రంపై మంచి క్రేజ్ క్రియేట్ అవుతోంది. అంతే కాకుండా ఈ చిత్రంలో మాస్ మ‌హారాజా ర‌వితేజ అతిథి పాత్ర‌లో మెరిసే అవ‌కాశం వుంద‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇదే నిజ‌మైతే విష్ణు విశాల్ కు తెలుగులో మంచి మార్కెట్ ఏర్ప‌డ‌టం ఖాయం అని అంటున్నారు. ఈ చిత్రానికి సంగీతం జ‌స్టిన్ ప్ర‌భాక‌ర‌న్‌, కెమెరా రిచ‌ర్డ్ ఎమ్ నాథ‌న్‌, ఎడిటింగ్ ప్ర‌స‌న్న జీకె, ఆర్ట్ ఉమేష్ జె. కుమార్‌, యాక్ష‌న్ అన్బుఅరివు.