Begin typing your search above and press return to search.

థ్రిల్ల‌ర్ మూవీ మండే టెస్ట్ పాసైపోయింది!

By:  Tupaki Desk   |   22 Nov 2022 3:37 PM GMT
థ్రిల్ల‌ర్ మూవీ మండే టెస్ట్ పాసైపోయింది!
X
ఈ మ‌ధ్య ప్రేక్ష‌కుల అభిరుచి మారిపోయింది. కాస్టింగ్ కంటే కంటెంట్ కే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో కంటెంట్ వున్న సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద విజ‌య విహారం చేస్తున్నాయి. స్టార్స్ తో సంబంధం లేకుండా కథే ప్ర‌ధానంగా తెర‌కెక్కిన సినిమాలు ఇటీవ‌ల వ‌రుస‌గా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటూ వ‌రుస‌గా విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నాయి. చిన్న సినిమాలుగా విడుద‌లై భారీ విజ‌యాల‌ని ద‌క్కించుకుంటూ బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ల‌ని రాబ‌డుతున్నాయి.

సంగీత‌, తిరువీర్, కావ్య‌ క‌ల్యాణ్ రామ్‌ ప్రధాన పాత్ర‌ల్లో తెర‌కెక్కిన హారర్ థ్రిల్ల‌ర్ `మ‌సూద‌`. మ‌ళ్లీ రావా, ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ వంటి సినిమాల‌తో అభిరుచి గ‌ల నిర్మాత‌గా మంచి పేరు తెచ్చుకున్న స్వ‌ధ‌ర్మ్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్ పై రాహుల్ యాద‌వ్ న‌క్క ఈ మూవీని నిర్మించారు. రీసెంట్ గా విడుద‌లైన ఈ మూవీ స్పైన్ థ్రిల్ల‌ర్ గా ఆక‌ట్టుకుంటూ విజ‌య ప‌థంలో దూసుకుపోతోంది. అయితే ఇలాంటి సినిమాల‌కు మండె టెస్ట్ అత్యంత కీల‌కంగా మారుతూ వుంటుంద‌న్న‌ది తెలిసిందే.

ఫ‌స్ట్ డే ఫ‌స్ట్ షోతో ఈ మూవీ అంద‌రి ప్ర‌శంస‌ల్ని సొంతం చేసుకుని హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే మండే టెస్ట్ పాసైతే కానీ ఈ సినిమా అస‌లు రిజ‌ల్ట్ ఏంటో బ‌య‌ట‌ప‌డ‌దు అని అంతా భావించారు. అన్న‌ట్టుగానే ఈ మూవీ మండే ట‌స్ట్ ని విజ‌య‌వంతంగా అధిగ‌మించి ఫ‌స్ట్ డే కి మించి మంచి వ‌సూళ్ల‌ని రాబ‌డుతోంది.

గ‌త శుక్ర‌వారం విడుద‌లైన ఈ సినిమాని ప్ర‌ముఖ నిర్మాత‌, పంపిణీదారుడు దిల్ రాజు రిలీజ్ చేశారు. అనుకున్న‌ట్టుగానే ఈ మూవీ రోజు రోజుకూ ప్రేక్ష‌కుల‌ని విశేషంగా ఆక‌ట్టుకుంటోంది.

శుక్ర‌వారం విడుద‌లైన ఈ మూవీ నాలుగ‌వ రోజు వ‌సూళ్లు బాగున్నాయి. ముందు రోజుకు మించి వ‌సూళ్లు వుండ‌టంతో ట్రేడ్ వ‌ర్గాలు హిట్ మూవీ అని చెబుతున్నారు. ఇప్ప‌టికే మౌత్ టాక్ తో వైర‌ల్ గా మారిన ఈ మూవీ వారం త‌రువాత ఏ స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌డుతుందో.. ఊ స్థాయి హిట్ గా నిలుస్తుందో వేచి చూడాల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.