Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: రౌడి ప్రొఫెసర్ ఇరగదీశాడు

By:  Tupaki Desk   |   8 Dec 2017 10:31 PM IST
ట్రైలర్ టాక్: రౌడి ప్రొఫెసర్ ఇరగదీశాడు
X
అన్ని ఇండస్ట్రీలలో ఒక మెగాస్టార్ ఉన్నాడు. తెలుగులో చిరంజీవి ఎలాగో మలయాళం లో కూడా అలాంటి మెగాస్టార్ ఉన్నారు. ఆయన ఎవరో కాదు సీనియర్ నటుడు మమ్మూట్టి. అయితే ఆయన కూడా తన ప్రతి సినిమా సినిమాకి మార్కెట్ రేంజ్ ని చాలా పెంచు కుంటున్నారు. మలయాళం సినిమాలు కూడా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకునే విధంగా ఆయన సినిమాలని చేశారు. మల్లు ఇండస్ట్రీలో లో మోస్ట్ పాపులర్ హీరోగా ఉన్న ఆయన నేషనల్ అవార్డ్ కూడా అందుకున్నారు.

ఇకపోతే రీసెంట్ గా ఆయన లేటెస్ట్ మూవీ 'మాస్టర్ పీస్' ట్రైలర్ రిలీజ్ అయ్యింది. యాక్షన్ డ్రామా తరహాలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్ లో రిలీజ్ కానుంది. సినిమాలో రౌడీ ప్రొఫెసర్ గా మమ్మూట్టి కనిపించడం చూస్తుంటే మలయాళం బాక్స్ ఆఫీస్ మరోసారి బద్దలవుతుందని ఈజీగా అర్ధమవుతోంది. ఇప్పటికే సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ప్రొఫెసర్ లుక్ లో మెగాస్టార్ స్టైలిష్ లుక్ లో అదరగొట్టేసాడు. సినిమా కథ మొత్తం కాలేజ్ నేపథ్యంలో ఉండనుందని తెలుస్తోంది. మంచి యాక్షన్ సీన్స్ కూడా సినిమా స్థాయిని పెంచేలా కనిపిస్తున్నాయి.

జనతా గ్యారేజ్ సినిమాలో నటించిన ఉన్ని ముకుందన్ పోలీస్ పాత్రలో కనిపిస్తున్నాడు. ముఖేష్ - మాక్బూల్ సల్మాన్ లాంటి స్టార్ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఇక సినిమాకు అజయ్ వాసుదేవ్ దర్శకత్వం వహిస్తుండగా ..రాయల్ సినిమాస్ ప్రొడక్షన్ వారు సినిమాను నిర్మిస్తున్నారు. క్రిస్మస్ కానుకగా మ్మాస్టర్ పీస్ ను రిలీజ్ చేసేందుకు సన్నాహకలు చేస్తున్నారు.