Begin typing your search above and press return to search.

‘మాస్టర్’ టీజర్ టాక్ : విజయ్ తో పోరుకు సై అంటున్న సేతుపతి

By:  Tupaki Desk   |   15 Nov 2020 3:30 AM GMT
‘మాస్టర్’ టీజర్ టాక్ : విజయ్ తో  పోరుకు  సై  అంటున్న సేతుపతి
X
తమిళనాట అగ్ర హీరోల సినిమాలు విడుదల కాక అభిమానులు సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా అమెజాన్ ప్రైమ్ లో సూర్య నటించిన ఆకాశమే నీ హద్దురా.. విడుదల కాగా ప్రేక్షకుల నుంచి చక్కటి స్పందన లభిస్తోంది. ఇప్పుడు కోలీవుడ్ మరో అగ్ర హీరో నటించిన మాస్టర్ సినిమా కూడా విడుదలకు సిద్ధమవుతోంది. ఇందులో అభిమానులకు మరో ట్రీట్ ఏమిటంటే విలక్షణ నటుడు విజయ్ సేతుపతి ఇందులో విలన్ గా యాక్ట్ చేస్తుండడం. విజయ్, విజయ్ సేతుపతి కాంబినేషన్లో సినిమా రూపుదిద్దుకోవడం.. ఇందులో సేతుపతి విలన్ గా నటిస్తుండడంతో ఈ సినిమాపై తమిళనాట భారీ అంచనాలే ఉన్నాయి. కొద్దిరోజులుగా ఈ సినిమాకు సంబంధించి అప్డేట్ రాకపోవడంతో ఫ్యాన్స్ నిరాశలో కూరుకుపోయారు. తాజాగా ‘మాస్టర్’ టీజర్ విడుదల కాగా ఇందులో విజయ్, సేతుపతి అదరగొట్టారు.

దీపావళి సందర్భంగా మేకర్స్ ‘మాస్టర్‌’ సినిమా టీజర్​ను విడుదల చేశారు. ‘నాకు తెలుసు సర్‌.. జేడీ ఒక నేరస్థుడు. అయినా.. ఒక సాధారణ ప్రొఫెసర్‌ ఇంత డేంజరస్ వ్యక్తిగా ఎందుకు మారాడు..?’ అనే డైలాగ్‌తో టీజర్​ ప్రారంభమైంది. స్టూడెంట్స్ గ్యాంగ్ వార్, మంచి ఫైట్ సీన్లతో ఈ వీడియో​ ఆద్యంతం ఆకట్టుకుంది. ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచింది. టీజర్ లో విజయ్‌ స్టైలిష్‌ గా, సరికొత్తగా కనిపించాడు.తన మార్క్ ఫైట్లు ఉండేలా ప్లాన్ చేసినట్టు ఉంది. సేతుపతి విలన్ లుక్ అదిరింది.రఫ్ క్యారెక్టర్ లో అతడు ఒదిగిపోయి కనిపించాడు. విజయ్, విజయ్ సేతుపతి మధ్య సాగే సన్నివేశాలు టీజర్‌లో హైలైట్‌గా నిలిచాయి.అనిరుధ్‌ రవిచందర్‌ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ డిఫరెంట్ గా ఉంది.

కార్తీతో ఖైదీ లాంటి బ్లాక్‌బస్టర్ తీసిన లోకేష్‌ కనగరాజ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. మాళవికా మోహనన్‌ హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాలో అర్జున్‌ దాస్‌, సిమ్రన్‌, భాగ్యరాజ్‌, ఆండ్రియా, శ్రీనాథ్‌, సంజీవ్‌ గౌరీ కిషన్‌, వీజే రమ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల ఆగిపోయింది. ఇప్పటికే తమిళనాట థియేటర్లు తెరుచుకున్నాయి. పరిస్థితులు కాస్త చక్కబడితే తొందర్లోనే ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.