Begin typing your search above and press return to search.

100కోట్ల‌కు `మాస్ట‌ర్` OTT డీల్.. పుకార్ల‌పై టీమ్ క్లారిటీ

By:  Tupaki Desk   |   28 Nov 2020 5:30 PM GMT
100కోట్ల‌కు `మాస్ట‌ర్` OTT డీల్.. పుకార్ల‌పై టీమ్ క్లారిటీ
X
ద‌ళ‌పతి విజయ్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో త‌మిళ ప‌రిశ్ర‌మ‌లో రికార్డులు బ్రేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. మెర్స‌ల్ చిత్రం 200కోట్ల గ్రాస్ వ‌సూలు చేయ‌డం ఓ సంచ‌ల‌నం. ప్ర‌స్తుతం విజ‌య్ `మాస్టర్` అనే స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ చిత్రంలో న‌టిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ పై ర‌క‌ర‌కాల సందిగ్ధ‌త‌లు హాట్ టాపిక్ గా మారాయి.

ఏప్రిల్ 9 న తమిళ న్యూ ఇయర్ ట్రీట్ గా ఈ మూవీని రిలీజ్ చేయాల్సి ఉండ‌గా.. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. ఇప్పటికీ విడుదల తేదీపై స్పష్టత లేదు. లాక్ డౌన్ సమయంలో దేశవ్యాప్తంగా థియేటర్లు మూసివేయడంతో ర‌క‌ర‌కాల పుకార్లు షికార్ చేశాయి.

మాస్టర్ థియేట్రికల్ విడుదలక వేచి చూడ‌టం కుద‌ర‌ద‌ని..OTTలో విడుదలవుతుంద‌ని ప్ర‌చార‌మైంది. తాజాగా నెట్ ఫ్లిక్స్ తో 100కోట్ల డీల్ కుదిరింద‌న్న ప్ర‌చారం హోరెత్తిపోతోంది. థియేట్రిక‌ల్ రిలీజ్ త‌ర్వాత ఓటీటీ స్ట్రీమింగ్ ఉంటుంద‌న్న ప్ర‌చారం ఉంది. అయితే నిర్మాత‌లు ఈ వార్తలను ఖండించారు. అవ‌న్నీ నిరాధార‌మైన వార్త‌లే. మాస్ట‌ర్ చిత్రం స‌రైన‌ సమయంలో థియేట్రిక‌ల్ రిలీజ్ కి వ‌స్తుంద‌ని ద‌ళ‌ప‌తి అభిమానులకు హామీ ఇచ్చారు. అయితే ఈ మూవీ సంక్రాంతికి రిలీజ‌వుతుందా లేక స‌మ్మ‌ర్ వ‌ర‌కూ వేచి చూడాలా? అన్న‌దానిపై స‌రైన స్ప‌ష్ఠ‌త‌ను ఇవ్వ‌లేదు.

ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్‌ గా నటించ‌గా.. మాళవికా మోహనన్ క‌థానాయిక‌గా న‌టించారు. ఆండ్రియా- అర్జున్ దాస్- శాంతను భాగ్యరాజ్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మరోవైపు విజయ్ తన 65వ సినిమా ని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచ‌న‌లో ఉన్నారు.