Begin typing your search above and press return to search.

వ‌రుస ఆఫ‌ర్ల‌తో కొరియోగ్రాఫ‌ర్ బిజీబిజీ

By:  Tupaki Desk   |   8 Jan 2022 9:00 PM IST
వ‌రుస ఆఫ‌ర్ల‌తో కొరియోగ్రాఫ‌ర్ బిజీబిజీ
X
టాలెంట్ వుంటే వారికి ఏదో ఒక‌రోజు గుర్తింపు ల‌భిస్తుంద‌ని, ప్ర‌తిభ వున్న వాళ్ల‌ని ఇండ‌స్ట్రీ ఊహించ‌ని విధంగా ప్రోత్స‌హించి అంద‌లం ఎక్కిస్తుంద‌ని, అక్కున చేర్చుకుంటుంది. ఇది జ‌గ‌మెరిగిన స‌త్యం. అలా టాలెంట్ ని న‌మ్ముకుని వ‌చ్చిన వాళ్ల‌ని ఇండ‌స్ట్రీ హైట్స్‌కి తీసుకెళ్లింది వారిని ఉన్న‌త స్థానాల్లో కూర్చోబెట్టింది. ఎంత మందికి చేరువ చేస్తుంది. ప్ర‌స్తుతం ఇదే ఫేజ్‌ని అనుభ‌విస్తున్నారు యంగ్ కొరియోగ్రాఫ‌ర్‌.

త‌న టాలెంట్ తో స్టార్ హీరో అల్లు అర్జున్‌, క్రేజీ భామ స‌మంత ప్ర‌శంస‌లు అందుకుంటున్నారు యంగ్ అండ్ ఎన‌ర్జిటిక్ డ్యాన్స్ మాస్ట‌ర్ పోలకి విజ‌య్‌. పాన్ ఇండియా స్థాయిలో `పుష్ప ది రైజ్‌` సెన్సేష‌న్ క్రియేట్ చేస్తున్న విష‌యం తెలిసిందే. ఈ మూవీ ఫంక్ష‌న్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కొరియోగ్రాఫ‌ర్ పోలకి విజ‌య్ ని పొగ‌డ్త‌ల్లో ముంచెత్తారు.

పోలికి విజ‌య్ ఈ చిత్రంలోని క్రేజీ సాంగ్ `ఊ అంటావా.. ఊఊ అంటావా..` సాంగ్ ని కంపోజ్ చేశారు. ఈ స‌మంత పై చిత్రీక‌రించిన ఈ పాట ఏ రేంజ్ లో సెన్సేష‌న్ ని క్రియేట్ చేసిందో తెలిసిందే. సినిమాకి మ‌రింత క్రేజ్‌ని తీసుకొచ్చింది. ఈ పాట కోసం పోలకి విజ‌య్ క్రియేట్ చేసిన హుక్ స్టెప్స్‌.. టోట‌ల్ సాంగ్ కోసం పోలింకి విజ‌య్ శ్ర‌మించిన తీరు స‌మంత‌ని బాగా ఆక‌ట్టుకుంద‌ట‌. ఇటీవ‌ల విడుద‌ల చేసిన ప్రాక్టీస్ వీడియోలో త‌న‌ని టార్చ‌ర్ చేశాడ‌ని స‌ర‌దాగా చెప్పినా పోలకి విజ‌య్ హార్డ్ వ‌ర్క్ కి ఫిదా అయిపోయి అత‌నికి శుభాకాంక్ష‌లు తెలియ‌జేస్తూ ప్రోత్స‌హించింది.

విజేత‌, కొబ్బ‌రిమ‌ట్ట, తిప్ప‌రా మీసం, ప‌లాస 1978, అల్లుడు అదుర్స్‌, శిశి వంటి చిత్రాల‌కు సూప‌ర్ హిట్ పాట‌ల‌కు కొరియోగ్రఫీని అందించారు. ఇటీవ‌ల `పుష్ప‌`తో పాపుల‌ర్ అయిన పోలంకి విజ‌య్ రాసెంట్ గా గ‌ల్లా అశోక్ `హీరో` చిత్రంలోని `డొనాల్ డ‌గ్గు..` ర్యాప్ సాంగ్ కు అదిరే స్టెప్స్ అందించారు. `న‌ర‌కాసుర‌`తో పాటు ప‌లు క్రేజీ ప్రాజెక్ట్ ల‌కు పోలకి విజ‌య్ వ‌ర్క్ చేస్తూ య‌మ బిజీగా మారిపోవ‌డం విశేషం. భ‌విష్య‌త్తులో పోలకి విజ‌య్ స్టార్ కొరియోగ్రాఫ‌ర్ గా మార‌డం ఖాయం అంటున్నారంతా.