Begin typing your search above and press return to search.

'మాస్టర్‌' టీజర్.. విజయ్‌ తెలుగులోనూ దుమ్ము

By:  Tupaki Desk   |   18 Dec 2020 9:59 AM IST
మాస్టర్‌ టీజర్.. విజయ్‌ తెలుగులోనూ దుమ్ము
X
తమిళ సూపర్‌ స్టార్‌ విజయ్‌ టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఆశించిన స్థాయిలో స్టార్‌ డం దక్కించుకోలేక పోయాడు. తమిళంలో మంచి మార్కెట్ ఉన్న విజయ్‌ కి తెలుగులో సూర్య రేంజ్ కనీసం కార్తీ రేంజ్‌ మార్కెట్ ఉన్నా కూడా సౌత్‌ ఇండియాలో ఆయన్ను కొట్టే హీరోనే ఉండడు అనడంలో సందేహం లేదు. కాని టాలీవుడ్‌ లో ఆయన సినిమాలు ఎక్కువ శాతం నిరాశ పర్చుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో మాస్టర్‌ తో తెలుగులో సూపర్‌ హిట్‌ ను కొట్టేందుకు సిద్దం అవుతున్నాడు. తమిళ ఖైదీ ని తెరకెక్కించిన లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో రూపొందిన 'మాస్టర్‌' సినిమా విడుదలకు సిద్దంగా ఉంది.

కరోనా కారణంగా నిలిచి పోయిన మాస్టర్‌ ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే ఏడాది ఆరంభంలోనే విడుదల చేసేలా ఉన్నారు. అందుకే టీజర్‌ ను వదిలారు. ఇటీవలే మాస్టర్‌ తమిళ టీజర్‌ వచ్చింది. ఇప్పుడు తెలుగు టీజర్‌ సందడి చేస్తోంది. సన్‌ పిక్చర్స్‌ బ్యానర్‌ లో రూపొందిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. అంచనాలకు తగ్గట్లుగా ఉంటుందని ఈ సినిమా టీజర్‌ చెప్పకనే చెబుతోంది.

తమిళంలో ఎలాగూ ఈ సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందనే నమ్మకం ఉంది. ఇలాంటి సమయంలో తెలుగు టీజర్‌ కూడా జనాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. తెలుగులో విజయ్‌ ఈ సినిమాతో మంచి విజయాన్ని సొంతం చేసుకుంటాడనే నమ్మకం వ్యక్తం అవుతుంది. లోకేష్‌ ఖైదీ సినిమా తెలుగులో ఆకట్టుకుంది. మరోసారి ఈ సినిమాతో కూడా ఆయన ఆకట్టుకుని విజయ్‌ కి తెలుగులో మొదటి విజయాన్ని ఇస్తాడేమో చూడాలి.