Begin typing your search above and press return to search.

సంక్రాంతి బరిలో ‘మాస్టర్’..?

By:  Tupaki Desk   |   28 Dec 2020 9:50 AM GMT
సంక్రాంతి బరిలో ‘మాస్టర్’..?
X
తమిళ తలపతి విజయ్ లేటెస్ట్ మూవీ ‘మాస్టర్’. ఈ చిత్రం ఎప్పుడో పూర్తయింది. కరోనా నేపథ్యంలో థియేటర్లు మూతపడడంతో ఈ మూవీని హోల్డ్ లో ఉంచింది చిత్ర యూనిట్. సూర్యలాంటి స్టార్ తన సినిమా ‘ఆకాశం నీ హద్దురా’ను ఓటీటీలో రిలీజ్ చేసినప్పటికీ.. విజయ్ టీం మాత్రం వెయిట్ చేసింది. ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అవుతుండడంతో ‘మాస్టర్’ను సంక్రాంతి బరిలో నిలపాలని డిసైడ్ అయినట్టు సమాచారం.

తాజాగా.. తమిళనాడు థియేటర్ యజమానుల అసోసియేషన్ ప్రెసిడెంట్ తిరుప్పూర్ సుబ్రమణియన్ మీడియాతో మాట్లాడుతూ.. తలపతి విజయ్ మరియు ‘మాస్టర్’ బృందానికి కృతజ్ఞతలు తెలిపారు. సినిమా పూర్తయి దాదాపు పది నెలలు గడిచినా.. ఓట్ట్ లో రిలీజ్ చేయకుండా ఉంచినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగానే ‘మాస్టర్’ మూవీ జనవరి 13 న భోగి స్పెషల్‌గా విడుదల అవుతుందని ఆయన ధృవీకరించారు.

ఈ మూవీ తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఒకేరోజు విడుదల కానుంది. చాలా కాలం తర్వాత వస్తున్న విజయ్ మూవీ కావడంతో తమిళనాడులో భారీ ఓపెనింగ్స్ వస్తాయని చిత్ర యూనిట్ తోపాటు, థియేటర్ యజమానులు భావిస్తున్నారు. ఇక, తెలుగు ప్రేక్షకులకూ విజయ్ సుపరిచితుడే కావడంతో.. ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ ఉంటుందని అంచనా వేస్తున్నారు. అయితే.. చిత్ర విడుదలపై యూనిట్ నుంచి మాత్రం అధికారిక ప్రకటన ఇప్పటి వరకూ రాలేదు. ఈ సాయంత్రం మేకర్స్ ఒక ప్రకటన చేయబోతున్నారు. అందులో రిలీజ్ డేట్ పై స్పష్టత ఇచ్చే అవకాశం ఉందని సమాచారం.

కాగా.. ఎగ్జిబిటర్లు ఈ సినిమా కోసం 100% ఆక్యుపెన్సీని అనుమతించమని ప్రభుత్వాన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. 50 శాతం ఆక్యుపెన్సీతో ఇబ్బందులు వస్తున్నాయని, పూర్తిస్థాయి సీట్ కెపాసిటీకి అనుమతించాలని కోరుతున్నట్టు సమాచారం. కానీ.. ఉన్న కరోనా పూర్తిస్థాయిలో తగ్గకుండానే, కొత్తగా కరోనా స్ట్రెయిన్ విజృంభిస్తున్న ఈ టైంలో ప్రభుత్వం అనుమతివ్వడం సాధ్యం కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా .. తెలుగులో ఇప్పటికే రవి తేజ ‘క్రాక్’, రామ్ ‘రెడ్’, బెల్లంకొండ శ్రీనివాస్ ‘అల్లుడు అదుర్స్’ సినిమాలు పొంగల్ బరిలో నిలిచాయి. ఇక ‘మాస్టర్‌’ కూడా వచ్చాడంటే సంక్రాంతి పోరు రచ్చ రచ్చగా ఉంటుంది. మరి, ఈ నాలుగు సంక్రాంతి పుంజుల్లో విజేతగా నిలిచేదెవరు? అన్నది చూడాలి.