Begin typing your search above and press return to search.

'మాస్టర్ చెఫ్' ప్రోమో: హాట్ లుక్ లో దర్శనమిచ్చిన మిల్కీ బ్యూటీ..!

By:  Tupaki Desk   |   6 Aug 2021 4:22 PM GMT
మాస్టర్ చెఫ్ ప్రోమో: హాట్ లుక్ లో దర్శనమిచ్చిన మిల్కీ బ్యూటీ..!
X
మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా సినీ ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లయినా, ఇప్పటికీ అందంతో ఆఫర్స్ లో కుర్ర హీరోయిన్లకు పోటీ ఇస్తోంది. వరుస అవకాశాలతో బిజీగా ఉన్న తమన్నా.. ఇటీవల ఓటీటీ వరల్డ్ లో కూడా అడుగుపెట్టి అక్కడ సక్సెస్ అయింది. '11త్ అవర్' 'నవంబర్ స్టోరీస్' వంటి వెబ్ సీరీస్‌ లలో నటించి ఆకట్టుకుంది. ఈ క్రమంలో ఇప్పుడు మిల్కీ బ్యూటీ బుల్లితెర‌పై సంద‌డి చేయడానికి రెడీ అయింది.

విదేశాల్లో బాగా ప్రాచుర్యం పొందిన 'మాస్టర్ చెఫ్' అనే వంటల ప్రోగ్రామ్ ద్వారా ఇప్పుడు తమన్నా తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. తెలుగు తమిళ కన్నడ మలయాళ భాషల్లో రూపొందుతున్న ఈ షో తెలుగు వెర్షన్ కు తమన్నా హోస్ట్‌ గా చేస్తున్నారు. తమిళ్ లో 'మక్కల్ సెల్వన్' విజయ్‌ సేతుపతి.. మలయాళంలో పృథ్వీ రాజ్‌.. కన్నడలో కిచ్చ సుదీప్‌ ఈ వంటల షో కు హోస్ట్ గా వ్యవహరించనున్నారు.

'మాస్టర్ చెఫ్' ప్రోగ్రామ్ జెమినీ టీవీలో ప్రసారం కానుంది. తెలుగు వంటకాలను ప్రపంచ వ్యాప్తంగా తెలియజేయాలనే ఉద్దేశ్యంతో ఈ షో ని రూపొందిస్తున్నారు. తాజాగా తమన్నా షో కు సంబంధించిన ప్రోమోని రిలీజ్ చేశారు. ఇందులో హాట్ లుక్‌ లో దర్శనమిచ్చిన తమన్నా మాట్లాడుతూ.. తెలుగు భాషలో ఓ గొప్పదనం ఉంటుందని.. తెలుగు వంటల్లో ఓ కమ్మదనం ఉంటుందని చెప్పుకొచ్చింది.

''ఎక్కడికి వెళ్లినా మన రాయలసీమ రుచుల్ని, కోస్తా పులుసుల్ని, తెలంగాణ దావత్ లను మనం ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి తెలుగు వంటల్ని మన తెలుగు వారందరితో కలిసి ప్రపంచమంతా గుర్తించేలా సెలబ్రేట్ చేసుకునేందుకు సరైన వేదిక మాస్టర్ చెఫ్'' అని తమన్నా ఈ ప్రోమోలో చెప్పారు. ఈ ప్రోగ్రామ్ కోసం స్టార్ హీరోయిన్ భారీ రెమ్యూనరేషన్ అందుకుంటోదని టాక్.

ఇక తమన్నా సినిమాల విషయానికొస్తే.. గోపిచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో రూపొందుతున్న కబడ్డీ బ్యాక్ డ్రాప్ మూవీ 'సీటీ మార్' లో హీరోయిన్ గా నటిస్తోంది. అలానే సత్యదేవ్ తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమా చేస్తోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఎఫ్ 3' సినిమాలో వెంకటేష్ కు జోడీగా తమన్నా కనిపించనుంది. ఇదే క్రమంలో నితిన్ - మేర్లపాక గాంధీ కాంబినేషన్ లో వస్తున్న 'మాస్ట్రో' చిత్రంలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తోంది.