Begin typing your search above and press return to search.

తమన్నాకు షాకిచ్చిన మాస్టర్ చెఫ్ నిర్వాహకులు

By:  Tupaki Desk   |   27 Oct 2021 8:00 AM
తమన్నాకు షాకిచ్చిన మాస్టర్ చెఫ్ నిర్వాహకులు
X
ప్రముఖ ఎంటర్ టైన్ మెంట్ చానెల్ జెమినీ టీవీలో ‘మాస్టర్ చెఫ్’ కార్యక్రమం ప్రసారమవుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ బ్యూటీ తమన్నా దీనికి హోస్ట్ గా చేస్తోంది. అయితే తమన్నాతో ఈ షోకు రేటింగ్ రాకపోవడం.. ఆమె యాంకరింగ్ అంతగా బాగా లేదన్న విమర్శల నేపథ్యంలో సడెన్ గా మాస్టర్ చెఫ్ నిర్వాహకులు తమన్నాను తొలగించి.. యాంకర్ అనసూయను తీసుకోవడం సంచలనమైంది.ఈ మార్పు చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి పలు కథనాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలోనే మాస్టర్ చెఫ్ నిర్వాహకులు దీనిపై వివరణ ఇస్తూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు.

‘మాస్టర్ చెఫ్’లో హోస్ట్ చేసేందుకు రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ ఇచ్చేలా తమన్నాతో అగ్రిమెంట్ చేసుకున్నామని నిర్వాహకులు తెలిపారు. జూన్ 24 నుంచి సెప్టెంబర్ చివరి వరకు మొత్తం 18 రోజులు షోకు హోస్ట్ గా వ్యవహరించేందుకు తమన్నాతో అగ్రిమెంట్ పై సంతకం చేశారని చెప్పారు.

అయితే ఆమెకు ఇతర కమిట్ మెంట్ల వల్ల కేవలం 16 రోజులు మాత్రమే షూటింగ్ కు వచ్చారని..రెండు రోజులు రాలేదని తెలిపారు. ఈ రెండు రోజులు ఆమె షూటింగ్ కు రాకపోవడం వల్ల 300 మంది టెక్నీషియన్లు పనిచేస్తోన్న తమకు రూ. 5 కోట్లకుపైగా నష్టం వచ్చిందిన వెల్లడించారు. ఆమెకు అప్పటికే రూ.1.56 కోట్ల పేమెంట్ చేశామని.. చివరి రెండు రోజులు షూటింగ్ కూడా పూర్తి చేసి ఉంటే మిగిలిన పేమెంట్ చేసేవాళ్లమని తెలిపారు.

అగ్రిమెంట్ ప్రకారం షూటింగ్ పూర్తి చేయకుండా సెకండ్ సీజన్ అడ్వాన్స్ కావాలని తమన్నా డిమాండ్ చేసిందని.. అసలు సెకండ్ సీజన్ కు ఆమెను తీసుకోవాలని తాము అనుకోలేదని నిర్వాహకులు స్పష్టం చేశారు. తమన్నా అంశానికి సంబంధించి ఏ వార్త రాయాలన్న మీడియా తమను సంప్రదించాలని నిర్వాహకులు కోరారు.