Begin typing your search above and press return to search.
రీమేక్ చేయాలంటే సక్సెస్ కానవసరం లేదన్నమాట
By: Tupaki Desk | 16 Jan 2021 8:37 AM ISTఈమద్య కాలంలో సౌత్ సినిమాలు వరుసగా బాలీవుడ్ లో రీమేక్ అవుతున్నాయి. ఎక్కువగా సక్సెస్ అయిన సినిమాలను మాత్రమే అక్కడ రీమేక్ చేస్తున్నారు. కొన్ని సినిమాలు కంటెంట్ బాగున్నాయి అనుకుంటే సౌత్ లో యావరేజ్ గా నిలిచినా లేదా ప్లాప్ అయినా కూడా కొందరు అభిరుచి ఉన్న బాలీవుడ్ నిర్మాతలు అక్కడ రీమేక్ చేసేందుకు సిద్దం అవుతున్నారు. ప్లాప్ సినిమాల రీమేక్ అనేది ఖచ్చితంగా సాహసమే అవుతుంది. కంటెంట్ చాలా గొప్పగా ఉంటే తప్ప అక్కడి అభిరుచికి తగ్గట్లుగా స్క్రిప్ట్ రెడీ చేస్తే తప్ప సినిమా సక్సెస్ అయ్యే అవకాశం ఉండదు. ఇప్పుడు మాస్టర్ సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.
తమిళ సూపర్ స్టార్ విజయ్ నటించిన మాస్టర్ సినిమాకు నెగటివ్ రెస్పాన్స్ వచ్చింది. కొందరు ఫ్యాన్స్ ఆహా ఓహో అంటూ ఉన్నా కూడా సినిమా విషయంలో ఎక్కువ శాతం మంది అభిమానులు పెదవి విరుస్తున్నారు. ఎన్నో ఆశలు పెట్టుకుంటే ఇలా చేశావ్ ఏంటి లోకేష్ అంటూ విజయ్ అభిమానులు నిటూర్చుతున్నారు. ఖైదీ సినిమాతో అలరించిన లోకేష్ కనగరాజ్ మాస్టర్ సినిమాతో నిరాశ పర్చాడు. సౌత్ లో నిరాశ పర్చినా కూడా మాస్టర్ ను ఉత్తరాదికి తీసుకు వెళ్లే సన్నాహాలు జరుగుతున్నాయి. ఖైదీ సినిమా ను నార్త్ లో రీమేక్ చేస్తున్నారు.
ఇప్పుడు మాస్టర్ ను కూడా బాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ప్లాప్ మూవీకి రీమేక్ అంటే కాస్త సాహసమే. కాని బాలీవుడ్ మేకర్స్ మాత్రం రీమేక్ చేయాలంటే సక్సెస్ మూవీనే అక్కర్లేదు అంటున్నారు. మాస్టర్ డబ్బింగ్ వర్షన్ ను హిందీలో విడుదల చేశారు. అయినా కూడా రీమేక్ నిర్ణయం తీసుకోవడం అంటే పెద్ద సాహసమే. మరి సాహసం చేయబోతున్న నిర్మాతలకు ఎలాంటి ఫలితం దక్కేనో చూడాలి.