Begin typing your search above and press return to search.

#మాస్ట‌ర్‌.. TS ‌లో స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తుల్లేవా?

By:  Tupaki Desk   |   13 Jan 2021 3:54 AM GMT
#మాస్ట‌ర్‌.. TS ‌లో స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తుల్లేవా?
X
ద‌ళ‌ప‌తి విజ‌య్ నటించిన `మాస్టర్` నేడు (13జ‌న‌వ‌రి) ప్ర‌పంచ‌వ్యాప్తంగా విడుద‌ల‌వుతోంది. తెలుగు రాష్ట్రాల్లోనూ స్ట్రెయిట్ సినిమాల‌తో పోటీప‌డుతూ ఈ సినిమా భారీగా థియేట‌ర్ల‌లో రిలీజ్ కానుండ‌డం ఆస‌క్తిని పెంచింది. అయితే చివ‌రి నిమిషంలో ఏమైందో కానీ తెలంగాణ‌లో ప్ర‌త్యేక షోల‌కు అనుమ‌తి ల‌భించ‌లేద‌ని తెలుస్తోంది.

అటు కోలీవుడ్ స‌హా టాలీవుడ్ లోనూ ఈ మూవీ గురించి జ‌నం ఆస‌క్తిగానే వేచి చూశారు. ఖైదీ ఫేం లోకేష్ కనగరాజ్ ద‌ర్శ‌కుడు కావ‌డంతో అంచనాలు స్కైలో ఉన్నాయి. ఈ యాక్ష‌న్ ఎంట‌ర్ టైన‌ర్ లో విజయ్ సేతుపతి ప్రధాన విల‌న్ పాత్రను పోషించారు. విజ‌య్- సేతుప‌తి అభిమానులు ఈ చిత్రాన్ని వెండితెరపై చూడటానికి చాలా ఆస‌క్తిగా వేచి చూశారు.

అయితే రిలీజ్ ముందే ఊహించ‌ని ట్విస్టు. ఏపీలో మాస్ట‌ర్ స్పెష‌ల్ షోల‌కు అనుమ‌తి ల‌భించినా తెలంగాణ‌లో అది సాధ్య‌ప‌డ‌లేదు. విజయవాడ కాపిటల్ సినిమాహాళ్లలో మాస్ట‌ర్ ప్రత్యేక ప్రదర్శనను ప్రదర్శించడానికి విజయ్ అభిమానులు అవసరమైన అనుమతులు పొందగా టిక్కెట్ సేల్ బావుంద‌ని తెలిసింది. ఇప్ప‌టికి ప్రత్యేక ప్రదర్శనలు లేక‌పోయినా మూవీ తెలంగాణలో య‌థావిధిగా మార్నింగ్ షో నుంచి అందుబాటులో ఉండ‌నుంది. అయితే ఇక్క‌డ ప్రివ్యూలు లేక‌పోవ‌డంతో మాస్ట‌ర్ ని ఎర్లీగా చూడటానికి ఆసక్తిగా ఎదురుచూసిన విజ‌య్‌ అభిమానులకు తీవ్ర నిరాశ త‌ప్ప‌లేదు. కాసేప‌ట్లో మాస్ట‌ర్ రివ్యూ తుపాకిలో చ‌దివేందుకు.. జ‌స్ట్ వెయిట్..