Begin typing your search above and press return to search.
#కరోనా క్రైసిస్.. భారీ రిలీజ్ లన్నీ డైలమాలో
By: Tupaki Desk | 19 Nov 2020 12:20 PM ISTకరోనా క్రైసిస్ వినోదపరిశ్రమల్ని అతలాకుతలం చేస్తోంది. ఇప్పటికే టాలీవుడ్ కి గుదిబండలా మారింది. థియేటర్లు తెరిచినా జనం బయటకు వచ్చేందుకు సిద్ధంగా లేకపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో సినిమా రిలీజ్ లపై స్పష్ఠత లేకుండా పోయింది. పంపిణీదారులు సినిమాల్ని రిలీజ్ చేసేందుకు.. ఎగ్జిబిటర్లు థియేటర్లను ఇప్పుడే తెరిచేందుకు ఎంతమాత్రం ఆసక్తిగా లేరు.
అయితే అటు ఉత్తరాదిన సన్నివేశం ఎలా ఉంది? అంటే ఇంతకుమించి గొప్పగా ఏం లేదు. అక్కడా థియేటర్లను తెరిచేందుకు ఎవరూ ఆసక్తిగా లేరట. ప్రభుత్వాలు అనుమతించినా సినిమాలు ఆడించే పరిస్థితి లేదు. ఈ ఏడాది ఇప్పటికే వేసవి సెలవులు .. మొన్న దసరా దీపావళి కూడా రిలీజ్ లు లేకుండా అయిపోయింది.
తదుపరి క్రిస్మస్ కి అయినా రిలీజ్ లు ఉంటాయా? అంటే సందేహమేనట. బాలీవుడ్ లో పలు భారీ చిత్రాలు కేవలం 2021లోనే థియేటర్లలోకి వస్తాయని తెలిసింది. లాక్ డౌన్ దెబ్బకు అకస్మాత్తుగా ప్రతిదీ మారిపోయింది. చాలా విడుదలలు ఆగిపోయాయి. అక్షయ్ కుమార్ లాంటి ఎదురేలేని హీరో కూడా తన `లక్ష్మి` చిత్రాన్ని ఆన్ లైన్ లో విడుదల చేసుకోవాల్సి వచ్చింది.
ఈ సంవత్సరం క్రిస్మస్ సందర్భంగా బాలీవుడ్ లో రిలీజ్ లు లేవా? అంటే లేవనే నిరాశ ఎదురవుతోంది. ముఖ్యంగా అక్షయ్ కే బిగ్ పంచ్ పడిపోతోంది. అతడు నటించిన సూర్య వంశీ ఈపాటికే రావాల్సింది వాయిదా పడిపోయింది. అలాగే కపిల్ దేవ్ జీవితకథ 1983 వరల్డ్ కప్ విక్టరీ ఆధారంగా తెరకెక్కిన `83` (రణవీర్ నటించాడు) వంటి పెద్ద బడ్జెట్ చిత్రం ఎప్పటికి వస్తుందో తెలీని పరిస్థితి నెలకొంది. థియేటర్లు తెరిచినప్పటికీ ఈ సంవత్సరం చివరిలో రిలీజ్ కష్టమేనట.
సూర్య వంశీ.. 83 చిత్రాలు ఇటీవలి కాలంలో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసినవి. రాబోయే రోజుల్లో అవి ఎప్పుడు బయటకు వస్తాయో తెలీని పరిస్థితి. వీటితో పాటు ఇరుగు పొరుగు పరిశ్రమల్లోనూ పలు క్రేజీ చిత్రాల రిలీజ్ లు ఎప్పటికి ఉంటాయి? అన్నది తేలని సన్నివేవం కనిపిస్తోంది. మహమ్మారీ ప్రభావం భయాలు ఇప్పటికీ అలానే ఉండడంతో ప్రజలు థియేటర్లకు వస్తారా రారా? అన్న సందిగ్ధత నెలకొంది ఇంకా.