Begin typing your search above and press return to search.

కొత్తందాల్ని వెతికి వెతికి మ‌రీ ప‌డుతున్న మాస్ రాజా

By:  Tupaki Desk   |   18 Oct 2020 11:00 AM IST
కొత్తందాల్ని వెతికి వెతికి మ‌రీ ప‌డుతున్న మాస్ రాజా
X
ప్ర‌తిభ ఉంటే కొత్తందాల‌కు అయినా అవ‌కాశాల‌కు కొద‌వేమీ లేదు. మ‌న స్టార్ హీరోలు ఎలాంటి భేష‌జానికి పోకుండా జూనియ‌ర్ భామ‌ల‌కు అయినా అవ‌కాశం ఇచ్చి ఎంక‌రేజ్ చేస్తున్నారు. ఇంతకుముందు డెటాల్ అలోవెరా సోప్ బ్యూటీ మాళ‌విక శ‌ర్మ‌కు నేల టిక్కెట్ లో అవ‌కాశం ఇచ్చాడు. ఇప్పుడు మ‌రో ఇద్ద‌రు కొత్త‌భామ‌ల్ని వెతికి మ‌రీ ప‌ట్టుకున్నాడ‌ట‌.

ర‌వితేజ‌- ర‌మేష్ వ‌ర్మ మూవీ `ఖిలాడీ`లో అంత‌గా అనుభ‌వం లేని ఓ ఇద్ద‌రు భామ‌ల‌కు అవ‌కాశం ఇచ్చార‌ట‌. మీనాక్షి చౌదరి- డింపుల్ హయతి అనే ఇద్దరు జూనియర్ హీరోయిన్లతో తెరపై రొమాన్స్ చేయనున్నాడ‌ట‌. నేడు(ఆదివారం) ఈ కొత్త చిత్రాన్ని ప్రారంభించి మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నారు. రాక్ష‌సుడు లాంటి సైకో థ్రిల్ల‌ర్ కి ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ర‌మేష్ వ‌ర్మ హీరో -విలన్ మధ్య మైండ్ గేమ్ నేప‌థ్యంలోని అంశాలతో థ్రిల్లర్ ని ఎంచుకున్నాడు. చాలా కాలంగా స‌రైన బంప‌ర్ హిట్టు లేక స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ ర‌వితేజ‌కు బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వాల‌న్న క‌సితో పని చేస్తున్నాడ‌ట‌.

ఇక క‌థానాయిక‌ల డేటా ప‌రిశీలిస్తే.. మీనాక్షి చౌదరి మిస్ ఇండియా 2018 విజేత. ప్ర‌స్త‌తం సుశాంత్ సరసన `ఇచ‌ట‌ వాహనములు నిల‌ప‌రాదు` అనే చిత్రంలో న‌టిస్తోంది. వరుణ్ తేజ్ `గద్దలకొండ గణేష్`లో డింపుల్ హయాతి ఒక ఐట‌మ్ సాంగ్ చేసింది. కొత్తందాలు మాస్ రాజా స‌ర‌స‌న ఏమేర‌కు రాణిస్తారో చూడాలి. నిరూపించుకునే అరుదైన అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకుంటారా లేదా? అన్న‌ది స‌స్పెన్స్.