Begin typing your search above and press return to search.
బాస్ చిరంజీవి స్ఫూర్తితో మాస్ రాజా ప్లానింగ్!
By: Tupaki Desk | 8 Sept 2021 10:35 AM ISTబిగ్ బి అమితాబ్ స్ఫూర్తితో మెగాస్టార్ చిరంజీవి 60 ప్లస్ ఏజ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల్ని ప్రకటిస్తూ నేటితరానికి షాక్ లిస్తున్న సంగతి తెలిసిందే. వయసు అనేది నంబర్ మాత్రమే.. నటుడిగా అలసట అన్నది ఉండదని నిరూపిస్తున్నారు. నలుగురు దర్శకులతో సినిమాల్ని ప్రకటించి మరో నలుగురు దర్శకుల్ని స్క్రిప్టులు రెడీ చేయమని చెప్పారంటే మెగాస్టార్ స్పీడ్ ఏ రేంజులో ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇక బిగ్ బి అమితాబ్.. మెగాస్టార్ చిరంజీవి లకు అభిమానిగా మాస్ మహారాజా రవితేజ కూడా వారిని స్ఫూర్తిగా తీసుకుని ప్రతిదీ అనుసరిస్తున్నారని సమాచారం. రవితేజ వయసు 53. కానీ 60వచ్చే లోపు.. అంటే ఈ ఏడేళ్లలోనే ఏడాదికి మూడు నాలుగు సినిమాలకు సంతకాలు చేస్తూ 20 సినిమాలు వేగంగా పూర్తి చేయాలని ప్లాన్ చేశారట.
అందుకు తగ్గట్టే ఇటీవల స్పీడ్ కనిపిస్తోంది. ఖిలాడీ షూటింగ్ దాదాపు పూర్తయింది. కానీ షూటింగ్ పూర్తి చేసి సినిమా విడుదల కాకముందే తదుపరి రామారావ్ ఆన్ డ్యూటీ (#RT68) షూటింగ్ ప్రారంభించాడు. కొత్త దర్శకుడు శరత్ మండవ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పుడు ఇది కూడా పూర్తి కాకముందే మరో ప్రాజెక్ట్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నాడు. త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో ఇది తెరకెక్కనుంది. ఈ సినిమా అక్టోబర్ 1 నుంచి సెట్స్ పైకి వెళ్లనుంది. రవితేజ ఒకేసారి రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటాడు. త్రినాధ్ రావు మాస్ మహారాజా బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టు స్క్రిప్టును రెడీ చేసారు. నిజానికి ఇదే స్క్రిప్ట్ విక్టరీ వెంకటేష్ తో చేయాల్సి ఉంది కానీ అది ఇప్పుడు రవితేజకి చేరింది.
ఇక రవితేజ నటిస్తున్న ఈ మూడు సినిమాల్లో ఒకటి ఈ ఏడాది విడుదలవుతుంది. మరో రెండు 2022 ప్రథమార్ధంలో విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదలైన క్రాక్ తో రవితేజ లో ఉత్సాహం రెట్టింపైంది. బ్యాక్ టు బ్యాక్ కథల్ని ఫైనల్ చేసి వేగంగా పూర్తి చేయాలన్న ఆలోచనతో ఉన్నారు. ఖిలాడీ నిర్మాతలు తమ విడుదల ప్రణాళికను ఇంకా వెల్లడించలేదు. త్వరలోనే రిలీజ్ తేదీని ప్రకటిస్తారని తెలుస్తోంది. మొత్తానికి బాస్ చిరంజీవి స్ఫూర్తితో రవితేజ ప్లానింగ్ సాగుతోంది. తన ఫేవరెట్ అమితాబ్ బచ్చన్ సైతం 70 ప్లస్ ఏజ్ లో తనకంటే స్పీడ్ గా ఉన్న సంగతి తెలిసిందే. అమితాబ్ అటు బాలీవుడ్ లో నటిస్తూనే ఇటీవల ప్రభాస్ -నాగ్ అశ్విన్ సినిమా షూటింగ్ లో జాయినైన సంగతి తెలిసిందే. మరోవైపు ఆయన బుల్లితెరపై కేబీసీ సిరీస్ ని దిగ్విజయంగా నడిపిస్తున్నారు. ఇంత బిజీలోనూ రవితేజ కంటే కూడా సోషల్ మీడియాల్లో అమితాబ్ యాక్టివ్ గా ఉంటారు.
ఆసక్తి పెంచుతున్న `రామారావ్ ఆన్ డ్యూటీ`
# RT68 టైటిల్ రామారావ్ ఆన్ డ్యూటీ అంటూ ప్రకటించిన సంగతి తెలిసిందే. శరత్ మండవ దర్శకత్వంలో శ్రీలక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ నిర్మిస్తోంది. ఫస్ట్ లుక్ కి అన్ని వర్గాల నుండి మంచి స్పందన లభించింది. ఇది క్రాక్ కి సీక్వెల్ తరహానా? అంటూ చర్చా సాగింది. క్రాక్ లో కాప్ గా నటిస్తే ఈ చిత్రంలో అతడు ఒక ప్రభుత్వ అధికారిగా కనిపించనున్నాడని సమాచారం. చిత్తూరు జిల్లాలో పనిచేస్తున్న ప్రభుత్వ అధికారిగా రవితేజ కనిపించనున్నారని .. మైనింగ్ మాఫియా లేదా ఎర్రచందనం స్మగ్లర్లను ఆట కట్టించే అధికారి కథాంశమని ప్రచారం సాగింది. ముసుగు దొంగల్లా గనుల్ని ప్రభుత్వ సంపదల్ని దోచేసే కొందరు అరాచకీయుల అంతం చూసేవాడిగా ఈ చిత్రంలో మాస్ రాజా కనిపిస్తారని గుసగుస వినిపిస్తోంది. ఇందులో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తారని కూడా మరో టాక్ ఉంది. రవితేజ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టే ఓ పవర్ ఫుల్ కథాంశాన్ని దర్శకుడు ఎంపిక చేసుకున్నారు.