Begin typing your search above and press return to search.

మాస్ రాజా ఆన్ డ్యూటీ.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చే రామారావు మాస్ నోటీస్..!

By:  Tupaki Desk   |   27 July 2022 7:47 AM GMT
మాస్ రాజా ఆన్ డ్యూటీ.. ఫ్యాన్స్ కు కిక్కిచ్చే రామారావు మాస్ నోటీస్..!
X
మాస్ మహారాజా రవితేజ నటించిన లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ ''రామారావు ఆన్ డ్యూటీ''. శరత్ మండవ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ కు రెడీ అయింది. ఈ శుక్రవారం జూలై 29న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో మేకర్స్ దూకుడుగా ప్రమోషన్స్ చేస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన 'రామారావు ఆన్ డ్యూటీ' టీజర్ - ట్రైలర్ మరియు సాంగ్స్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. మరో రెండు రోజుల్లో సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న తరుణంలో తాజాగా 'రామారావు మాస్ నోటీస్' పేరుతో రిలీజ్ ట్రైలర్ ను లాంచ్ చేశారు.

మాస్ యాక్షన్ తో కూడిన పవర్ ప్యాక్డ్ 'రామారావు మాస్ నోటీస్' మాస్ మహారాజా ఫ్యాన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో రవితేజ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ గా కనిపిస్తున్నప్పటికీ.. ధర్మాన్ని కాపాడటానికి తనలోని మరో కోణాన్ని బయటపెట్టినట్లు తెలుస్తోంది.

సాధారణంగా మిస్సింగ్‌ కేసులను పోలీసులు చేధిస్తుంటారు. కానీ ఇక్కడ రామారావు అనే ఓ సివిల్‌ ఆఫీసర్‌ ఇన్వెస్టిగేషన్ చేసి.. కేసుని ఎలా ముగించాడనేది చూపించబోతున్నారు. ఈ క్రమంలో అతను ఎలాంటి సవాళ్ళను ఎదుర్కొన్నాడు? తన ఫ్యామిలీని ఎలా రక్షించుకున్నాడు? అనేది ఆసక్తికరం.

'నేను లక్కుల మీద లాట్ ల మీద డిపెండ్ అయ్యేవాడిని కాదు.. వర్క్ మీద డిపెండ్ అయ్యేవాడిని' అని రవితేజ చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది. ఇదొక మిస్టరీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ అనుకునే విధంగా ట్రైలర్ ను కట్ చేయగా.. లేటెస్టుగా వచ్చిన రిలీజ్ ట్రైలర్ లో మాస్ మరియు యాక్షన్ అంశాలకు ప్రాధాన్యం ఇచ్చారు.

వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ సరసన దివ్యాంశ కౌశిక్ - రజిషా విజయన్ హీరోయిన్లుగా నటించారు. వేణు తొట్టెంపూడి కీలక పాత్ర పోషించగా.. 'సర్పట్ట' జాన్ విజయ్ - నాజర్ - సీనియర్ నరేష్ - పవిత్ర లోకేష్ - చైతన్య కృష్ణ - తనికెళ్ల భరణి - రాహుల్ రామకృష్ణ - ఈరోజుల్లో శ్రీ ఇతర పాత్రల్లో కనిపించనున్నారు.

శ్యామ్ సీఎస్ సమకూర్చిన బ్యాగ్రౌండ్ స్కోర్ తెలుగు సినిమాల్లో అరుదుగా వినిపించేదని చెప్పాలి. సినిమాటోగ్రాఫర్ సత్యన్ సూర్యన్ అందించిన విజువల్స్ బాగున్నాయి. సాహి సురేష్ ఈ చిత్రానికి ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేయగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.

శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ మరియు RT టీమ్ వర్క్స్ బ్యానర్లపై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. 'ఖిలాడి' వంటి ప్లాప్ సినిమా తర్వాత రవితేజ నుంచి వస్తోన్న ''రామారావు ఆన్ డ్యూటీ'' ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.