Begin typing your search above and press return to search.

ఫొటోటాక్‌ః యాక్షన్‌ మూడ్‌ లో మాస్ రాజా

By:  Tupaki Desk   |   24 March 2021 4:30 AM GMT
ఫొటోటాక్‌ః యాక్షన్‌ మూడ్‌ లో మాస్ రాజా
X
రవితేజ ఈ ఏడాది ఆరంభంలో క్రాక్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ ను దక్కించుకున్నాడు. చాలా గ్యాప్ తర్వాత రవితేజకు సక్సెస్‌ పడింది. ఆ ఉత్సాహంతో రవితేజ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే రమేష్ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం ఇటలీలో జరుగుతున్న విషయం తెల్సిందే. రవితేజ మరియు చిత్ర యూనిట్‌ సభ్యులు ఇటలీలో ఉన్నారు. తాజాగా రవితేజ ఈ ఫొటోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేశాడు.

బైక్‌ పై వెళ్తున్న రవితేజ ను ఈ ఫొటోలో చూడవచ్చు. సినిమా లోని ఒక చేజింగ్ సన్నివేశంలో భాగంగా రవితేజ ఇలా ఇటలీ రోడ్ల మీద బైక్‌ పై రైడ్‌ చేస్తున్నాడు. యాక్షన్‌ మూడ్ ఆన్‌ అంటూ రవితేజ ఈ ఫొటోకు కామెంట్‌ పెట్టాడు. మాస్ హీరో రవితేజ ఈ సినిమాతో మరోసారి తన అభిమానులకు ఫుల్‌ మీల్స్ పెట్టే విధంగా మాస్‌ ఎలిమెంట్స్ ఉంటాయని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పెద్ద ఎత్తున సినిమా ను చిత్రీకరిస్తున్నట్లుగా దీన్ని బట్టి అర్థం అవుతుంది. ఇటీవలే యాంకర్‌ అనసూయ కూడా ఈ సినిమా కోసమే ఇటలీ వెళ్లిన విషయం తెల్సిందే.