Begin typing your search above and press return to search.

మాస్ మసాలా అంటే జై బాలయ్యే.....?

By:  Tupaki Desk   |   10 Nov 2021 11:30 PM GMT
మాస్ మసాలా అంటే జై బాలయ్యే.....?
X
బాలయ్య అన్ని రకాల జానర్లూ చేశారు. ఆయన స్టార్టింగ్ డేస్ లో సీతారామ కళ్యాణం అన్న లవ్ సబ్జెక్ట్ ని కూడా హాస్య బ్రహ్మ జంధ్యాల డైరెక్షన్ లో చేసి సూపర్ హిట్ కొట్టారు. ఇక తండ్రి ఎన్టీయార్ డైరెక్షన్ లో చేసిన సినిమాలు అన్నీ పౌరాణికాలు, చారిత్రకాలే. బాలయ్య సోలో హీరో అయ్యాక మొదట్లో చేసిన సినిమాల్లో నవరసాలు ఉండేవి.

కానీ బాలయ్య అంటే మాత్రం పక్కా మాస్ అంటారు. ఆయనలోని ఆ యాంగిల్ ని పట్టుకున్నారు డైరెక్టర్స్. నాటి నుంచి వారు చేసే ప్రయోగాలతో బాలయ్య కేరాఫ్ మాసిజం అయిపోయారు. ఆయన సినిమాలకు క్లాసిక్ టచ్ ఇచ్చే టైటిల్స్ పెట్టాలీ అంటేనే మేకర్స్ భయపడే సీన్ ఉండేది. ఇదిలా ఉంటే గత రెండేళ్ళుగా టాలీవుడ్ కరోనా కష్టాలతో విలవిలాడుతోంది. దాంతో పాటు సరైన హిట్ లేదు. అగ్ర హీరోల మూవీస్ అయితే ధియేటర్ల ముఖం చూసి ఎరగటంలేదు. ఈ మధ్యలో కొన్ని సినిమాలు వచ్చాయి, హిట్ అయ్యాయి, కానీ మరీ పక్కా మాస్ మూవీ అంటే మాత్రం వేచి చూడాల్సిందే అన్న సీన్ ఉంది.

అంతలా మాస్ రుచి కోసం విసిగి వేసారి ఉన్న టాలీవుడ్ ఆడియన్స్ కి బాలయ్య అద్భుతమైన ఫీస్ట్ ఇస్తాడని అంటున్నారు. ఆయన నటించిన అఖండ మూవీ సరైన టైమ్ లోనే రిలీజ్ అవుతోంది అన్న మాట కూడా ఉంది. మంచి మాస్ మసాలా మూవీ చూసి ఏళ్ళు పూళ్ళూ అయిపోయిన నేపధ్యంలో బాక్సాఫీస్ బొనాంజా బాలయ్య ఊర మాస్ డైరెక్టర్ బోయపాటితో కలసి థియేటర్లలోకి దిగిపోతున్నాడు. అఖండలో ఏమి ఉన్నాయి అన్న మాట కంటే ఏమి లేవు అని అడగడమే బెటర్ అంటున్నారు.

అంతలా ఈ మూవీని తన లెక్కలతో కొలతలతో నింపేశాడు బోయపాటి. భారీ డైలాగులు, ఊగిపోయే ఫైట్లు, అదిరిపోయే యాక్షన్ సీన్లు ఇలా అఖండ బ్రహ్మాండమైన ప్యాకేజ్ గా రెడీ అయింది అని టాక్. అన్నీ అనుకూలిస్తే ఈ మూవీ డిసెంబర్ 2న రిలీజ్ అంటున్నారు. మధ్యలో ఏ సినిమా పోటీ లేదు. అఖండ ఆడియన్స్ ని కనెక్ట్ అయితే మాత్రం ఓ రేంజిలో మాస్ మోత మోగిస్తుంది అంటున్నారు. కనీసం మూడు వారాల పాటు థియేటర్లు షేక్ అయ్యేలా రీ సౌండ్ చెస్తుంది అని అంటున్నారు. మొత్తానికి అఖండ పాత లెక్కలు తేల్చేసి కొత్త రికార్డులు నెలకొల్పుతాడు అని ఫ్యాన్స్ అంటున్నారు. సో వెయిట్ చేయాల్సిందే. జై బాలయ్య అనాల్సిందే.