Begin typing your search above and press return to search.

బాల‌య్య‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన మాస్ మ‌హారాజా

By:  Tupaki Desk   |   22 Dec 2021 6:00 PM IST
బాల‌య్య‌కు ఫుల్ క్లారిటీ ఇచ్చిన మాస్ మ‌హారాజా
X
నంద‌మూరి న‌ట‌సింహం `ఆహా ` ఓటీటీ లో `అన్ స్టాప‌బుల్ విత్ ఎన్‌బీకే` పేరుతో స్ట్రీమింగ్ అవుతున్న షోకు హోస్ట్ గా వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. `అఖండ‌` స‌క్సెస్‌తో ఫుల్ జోష్ లో వున్న బాల‌య్య అంతే జోష్ తో `అన్ స్టాప‌బుల్‌` షోని కంటిన్యూ చేస్తున్నారు. క‌లెక్ష‌న్ కింగ్ మోహ‌న్ బాబుతో మొద‌లైన ఈ టాక్ షో పేరుకు త‌గ్గ‌ట్టే అన్ స్టాప‌బుల్ గా సాగుతోంది. తాజాగా ఈ షోకు మాస్ మ‌హారాజా ర‌వితేజ ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేనితో క‌లిసి వ‌చ్చారు.

తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమోని మేక‌ర్స్ రిలీజ్ చేశారు. గ‌తంలో బాల‌కృష్ణ - ర‌వితేజ‌ల మ‌ధ్య ఓ విష‌యంలో కోల్డ్ వార్ న‌డిచింద‌ని టాక్ వున్న నేప‌థ్యంలో ఈ టాక్ షోలో ఎలాంటి విష‌యాలు బ‌య‌టికి రానున్నాయోన‌ని, ర‌వితేజ‌ని బాల‌య్య ఎలాంటి ప్ర‌శ్న‌లు సంధించ‌బోతున్నారా? అనే ఆస‌క్తి అంద‌రిలోనూ నెల‌కొంది.

ఈ నేప‌థ్యంలో విడుద‌ల చేసిన ప్రోమో ఆ ప్ర‌శ్న‌ల‌న్నింటికీ స‌మాధానం చెప్పింది. ప్రోమోలో టాక్ షో `మొదలుపెట్టే ముందు బాసు .. ఒక క్లారిటీ తీసుకోవాలి.. అని బాల‌య్య అన‌గా.. ఏంటో చెప్పండి అని ర‌వితేజ అన‌డం.. ఆ వెంట‌నే `నీకూ నాకూ పెద్ద గొడ‌వైందంట‌క‌దా... అని బాల‌య్య అన‌డం.. దానికి ర‌వితేజ పెద్ద‌గా న‌వ్వ‌డంతో అక్క‌డ న‌వ్వులు విరిసాయి.

త‌రువాత ర‌వితేజ మాట్లాడుతూ `ప‌నీ పాట లేనీ డ్యాష్ నా డ్యాష్ గాళ్ల‌కి ఇదే ప‌ని .. అంటూ న‌వ్వేశాడు. నీకు కోపం వ‌చ్చిన‌ప్పుడు నువ్వు వాడే నాలుగు బూతులు చెప్పు స‌ర‌దాగా అని బాల‌య్య అడిగితే.. `నేను బూతులు మొద‌లుపెడితే చ‌స్తారు కానీ.. అని ర‌వితేజ చెప్ప‌డం న‌వ్వులు పూయిస్తోంది.

అతి విన‌యం ధూర్త ల‌క్ష్యం.. చేతుల క‌ట్టుకున్నాడో వాడి డిప్ప‌ప‌గిలిన‌ట్టే.. మొగ‌ల్రాజ‌పురంలో అమ్మాయికి లైన్ లు వేస్తుండేవాడివ‌ట‌గా.. అంటూ మాస్ రాజా పురాణం అందుకున్నాడు బాల‌య్య‌.. దీంతో బాబోయ్ ఇది కూడా తెలిసిపోయిందా? అని ర‌వితేజ బావురు మ‌న్నాడు.

ఇక నీకొడుకు నీకంటే టాలెంటెడ్ అంటగా అని బాల‌య్య అడిగితే .. అందుకే వాడికి డిఎన్ కె అని పెట్టుకున్నాన‌ని, డీ ఎన్ కె అంటే దొంగ నా.. డాష్ అని ర‌వితేజ చెప్ప‌డంతో బాల‌య్య గొల్లున న‌వ్వేశారు. ఆ త‌రువాత స్టేజ్ పైకి ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని పిలిచిన బాల‌య్య నెక్స్ట్ బ్లాక్ బ‌స్ట‌ర్ ఇవ్వ‌క‌పోతే కుమ్మేస్తాన‌ని కామెడీ చేసి గోపీపై కూడా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించాడు.

రైట‌ర్ కాక ముందు ఊళ్లో అరెస్ట్ అయ్యావంట‌క‌దా? అని అడిగితే `స‌మ‌ర‌సింహారెడ్డి` కోస‌మే అరెస్ట్ అయ్యాన‌ని చెప్ప‌డం.. డ్ర‌గ్స్ కేసు గురించి ర‌వితేజ షాకింగ్ విష‌యాలు బ‌య‌ట‌పెట్ట‌డంతో అన్ స్టాప‌బుల్ ఆస‌క్తిని రేకెత్తిస్తోంది.