Begin typing your search above and press return to search.

20 రోజుల్లోనే మాస్ మహారాజ ఫేట్ మారిపోయిందిగా

By:  Tupaki Desk   |   20 Jan 2023 9:30 AM GMT
20 రోజుల్లోనే మాస్ మహారాజ ఫేట్ మారిపోయిందిగా
X
మాస్ మహారాజాగా పేరు తెచ్చుకున్న హీరో రవితేజ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. ఆయన తాజాగా ధమాకా సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా ద్వారానే ఆయన మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే అంతకు ముందు నటించిన క్రాక్, ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీలు డిజాస్టర్లుగా నిలిచాయి. కానీ అతి తక్కువ సమయంలోనే వరుస విజయాలతో దూసుకెళ్తూ.. తన జోరు చూపించాడు. ధమాకా సినిమా దాదాపు 80 కోట్ల పైనే గ్రాస్ కలెక్షన్లు రాబట్టినట్లు తెలుస్తోంది.

గతేడాది హిట్టుగా నిలిచిన ధమాకా సినిమాతో ఇయర్ ఎండ్ చేయగా.. ఈ ఇయర్ ను వాల్తేరు వీరయ్యతో స్టార్ట్ చేశాడు. అయితే ధమాకా సినిమాకు సరైన రివ్యూలు రాకపోయినప్పటికీ.. బాక్సాఫీసు వద్ద మాత్రం భారీగానే కలెక్షన్లను వసూలు చేసింది.

క్రిస్మస్ సమయంలో వచ్చి అందరినీ బాగానే ఆకట్టుకుంది. అయితే నూతన సంవత్సరం ప్రారంభంలోనే వాల్తేరు వీరయ్యతో రవితేజ మళ్లీ హిట్టు కొట్టాడు. సంక్రాంతికి విడుదల అయిన ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది.

వాల్తేరు వీరయ్యలో చిరంజీవి హీరోగా నటించగా.. రవితేజ ప్రముఖ పాత్రలో కనిపించి మంచి మార్కులు కొట్టేశాడు. అయితే కేవలం 20 రోజుల వ్యవధిలోనే రెండు సినిమాలు విడుదల అవడం, ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద విజయం సాధించడంతో .. 20 రోజుల్లోనే రవితేజ ఫేట్ మారిపోయిందని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. పండగ సమయంలో వచ్చిన ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలు.. రవితేజ కు భారీ ప్రయోజనాలనే చేకూర్చాయి.

అయితే తర్వాత రాబోతున్న రవితేజ చిత్రం రావణాసుర ఏ రేంజ్ లో ఆకట్టుకోనుందో తెలియాలంటే ఇంకా కొంత కాలం ఆగాల్సిందే. యూనిక్ థ్రిల్లర్ జోనర్‌ లో రావణాసుర సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని సుధీర్ వర్మ డైరెక్ట్ చేస్తున్నారు.

రావణాసుర మూవీలో అనూ ఎమ్మాన్యూయేల్, పూజితా పొన్నాడ, దక్షా నగార్కర్, ఫరియా అబ్దుల్లా(జాతిరత్నాలు - చిట్టి), మేఘా ఆకాశ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.