Begin typing your search above and press return to search.

సబ్ కలెక్టర్ గా స్టార్ హీరో..!

By:  Tupaki Desk   |   13 July 2021 10:30 AM GMT
సబ్ కలెక్టర్ గా స్టార్ హీరో..!
X
మాస్ మహారాజా రవితేజ హీరోగా నటిస్తున్న 68వ చిత్రానికి ''రామారావు ఆన్ డ్యూటీ'' అనే పవర్ ఫుల్ టైటిల్ ను ఖరారు చేసిన సంగతి తెలిసిందే. సోమవారం విడుదల చేసిన టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ పోస్టర్ కు విశేష స్పందన వచ్చింది. ఇందులో రవితేజ ఫార్మల్ డ్రెస్ లో నీట్ గా టక్ చేసుకొని.. బ్లాక్ కళ్ళద్దాలు పెట్టుకొని స్టైలిష్ గా ఉన్నారు. డెబ్యూ డైరెక్టర్ శరత్‌ మండవ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక స్పెషల్ యాక్షన్‌ థ్రిల్లర్‌ గా ఈ చిత్రాన్ని రెడీ చేస్తున్నారు. ఇందులో రవితేజ ప్రభుత్వ అధికారి పాత్రలో నటిస్తున్నాడని తెలుస్తోంది. ఇప్పటి వరకు విడుదలైన ప్రచార చిత్రాలు చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

అయితే డైరెక్టర్ శరత్ మాండవ తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రంలో సబ్ కలెక్టర్ పాత్రలో రవితేజ నటించనున్నట్లు వెల్లడించారు. అది దూకుడు స్వభావం కలిగిన నిజాయితీ గల ఆఫీసర్ పాత్ర అని తెలుస్తోంది. ఇది మాస్ మహారాజాకు టిపికల్ క్యారక్టర్ కాదు కానీ.. ఆ పాత్రలో రెండు పార్శ్వాలు ఉండటమనేది ఇక్కడ ఆసక్తికరమైన అంశం. ప్రీ లుక్ పోస్టర్ లోనే రవితేజ రెండు చేతులతో సంతకాలు పెట్టినట్లు చూపించి రామారావు పాత్రలో రెండు షేడ్స్ ఉంటాయని హింట్ ఇచ్చారు. ఈ సినిమా 1995 బ్యాక్ డ్రాప్ లో రియల్ ఇన్సిడెంట్స్ ప్రేరణగా సెట్ చేయబడిందని టాక్ వినిపిస్తోంది.

RT టీమ్‌ వర్క్స్ తో కలిసి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి 'రామారావు ఆన్ డ్యూటీ' చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో రవితేజ సరసన 'మజిలీ' ఫేమ్ దివ్యాన్ష కౌశిక్ హీరోయిన్ గా నటిస్తోంది. నాజర్ - నరేష్ - పవిత్ర లోకేష్ - రాహుల్ రామకృష్ణ - 'ఈరోజుల్లో' శ్రీ - సురేఖ వాణి - మధు సూధన్ రావు తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి శ్యామ్ సీఎస్ సంగీతం సమకూరుస్తున్నారు. సత్యన్‌ సూర్యన్‌ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా.. ప్రవీణ్ కెఎల్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌ లో జరుగుతోంది.