Begin typing your search above and press return to search.
నిర్మాతగా మారనున్న మాస్ హీరో.. సక్సెస్ అవుతాడా??
By: Tupaki Desk | 16 Feb 2021 10:00 PM ISTటాలీవుడ్ మాస్ రాజా ఇటీవలే క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్నాడు. రవితేజ కెరీర్ లో క్రాక్ 66వ సినిమాగా రూపొందింది. ఈ సినిమాలో రవితేజ పవర్‌ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించి ఆకట్టుకున్నాడు. గతేడాది మే నెలలో విడుదల కావాల్సిన ఈ సినిమా.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బాక్సాఫీస్ సూపర్ హిట్ అయింది. ఇప్పటికే వసూళ్ల పరంగా 50కోట్ల మార్క్ దాటిన క్రాక్ మాసీవ్ హిట్ అందుకుంది. వరుస ప్లాప్ లలో ఉన్న రవితేజ కెరీర్లో 'రాజా ది గ్రేట్' తర్వాత వరుసగా టచ్ చేసి చూడు, నేలటికెట్, అమర్ అక్బర్ ఆంథోనీ, డిస్కోరాజా సినిమాలు ఒకటికి మించి మరొకటి ప్లాప్స్ అయ్యాయి. ప్రస్తుతం క్రాక్ ఇచ్చిన రిలీఫ్ మాములుగా లేదట. కొత్త ఉత్సాహంతో కొత్త నిర్ణయాలు తీసుకుంటున్నాడట మాస్ రాజా.
క్రాక్ హిట్ జోరులో రవితేజ పారితోషికం రేట్లు కూడా పెంచేసినట్లు టాక్ నడుస్తుంది. ప్రస్తుతం రమేష్ వర్మతో ఖిలాడి సినిమా తప్ప ఇంకేదీ ఓకే చేయలేదని ఇండస్ట్రీ గుసగుసలాడుతుంది. ఇదిలా ఉండగా.. ఈమధ్య హీరోలు కూడా ఎవరికీ వారే ప్రొడక్షన్ ప్రారంభించే ప్లాన్స్ చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే పలువురు స్టార్స్ ప్రొడ్యూసర్స్ గా మారి సినిమాలు కూడా ప్రొడ్యూస్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా రవితేజ కూడా కొత్తగా ప్రొడక్షన్ స్టార్ట్ చేయనున్నాడు. ఆర్.టి వర్క్స్ అనే బ్యానర్ పై రవితేజ కూడా ఇకపై సినిమాలు నిర్మించనున్నాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. తన బ్యానర్ పై రవితేజ కొత్త దర్శకులతో చిన్న బడ్జెట్ సినిమాలు తీస్తాడని సమాచారం. చూడాలి మరి మాస్ రాజా ప్రొడ్యూసర్ గా సక్సెస్ అవుతాడేమో!