Begin typing your search above and press return to search.
దర్శకుడికి హ్యాండ్ ఇచ్చిన మాస్ హీరో
By: Tupaki Desk | 2 Sept 2019 2:46 PM ISTఇండస్ట్రీ లోపల జరిగే కథలు వింతలు మాములుగా ఉండవు. అనిష్చితికి మారుపేరుగా నిలిచే ఇక్కడి వ్యక్తుల మనస్తత్వాలు ఒకోసారి కొందరి విలువైన టైంని జీవితాన్ని పణంగా పెట్టేసుకుంటాయి. ఇదీ అలాంటి కథే. అతనో కుర్ర డైరెక్టర్. గత ఏడాది ఓ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కొట్టాడు. యూత్ ని టార్గెట్ చేసి ప్రేమలోని మరో కోణాన్ని హీరోయిన్ పాత్ర ద్వారా నెగటివ్ గా చూపించిన తీరుకు బాక్స్ ఆఫీస్ సక్సెస్ దక్కింది . దీంతో ఈ దర్శకుడి డిమాండ్ ఎక్కడికో వెళ్లిపోయింది.
పెద్ద పెద్ద నిర్మాణ సంస్థల నుంచి ఆఫర్స్ వచ్చాయి. కాని తాను నమ్మిన కథకు తగ్గ ఆర్టిస్టులు దొరికినప్పుడే సినిమా చేయాలనీ నిర్ణయించుకుని ఆ మేరకు మరో స్క్రిప్ట్ ని సిద్ధం చేసుకున్నాడు. తొలుత ఓ ఇద్దరు ముగ్గురు హీరోలను ట్రై చేశాడు కాని కుదరలేదు. ఆఖరికి మాస్ మార్కెట్ లో మంచి ఇమేజ్ ఉన్న ఓ హీరోని పట్టాడు . అతనికి ఇతని వర్క్ నచ్చింది. కథ బ్రహ్మాండం అన్నాడు. నిర్మాత కూడా రెడీ అయ్యాడు. కట్ చేస్తే ఇంకో నెల రెండు నెలల్లో షూటింగ్ ప్రారంభించాల్సి ఉండగా రెమ్యునరేషన్ దగ్గర ఆ హీరో ఏకంగా `14 కోట్లు డిమాండ్ చేయడంతో షాక్ తిన్న నిర్మాత నావల్ల కాదని తప్పుకోవడంతో ఈ దర్శకుడు షాక్ తిన్నాడు.
గత ఏడాది మూడు దారుణమైన డిజాస్టర్లు ఉన్న ఈ మాస్ హీరో ఇప్పుడు ఇంత డిమాండ్ చేయడం చూసి నోటమాట రాలేదు. అంతేకాదు కథలో కూడా చాలా మార్పులు అడిగాడట. దీంతో చిర్రెత్తుకొచ్చిన దర్శకుడు ఈ హీరోతో మాత్రం చేయనని చెప్పి వచ్చేశాడట. సదరు హీరో మంచి కథలను ఇలా పారితోషికం పేరిట కథలో మార్పుల పేరిట పోగొట్టుకోవడం వల్లే సరైన జడ్జ్ మెంట్ లేక దెబ్బ తింటున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. షూటింగ్ లో ఆ హీరో మరో చిత్రం ఇలాంటి కారణాల వల్లే ఆలస్యమవుతూ ఫైనల్ గా డిసెంబర్ ను లాక్ చేసుకుంది