Begin typing your search above and press return to search.
ఐటమ్ హీరోయిన్ల వేటలో పడిన మాస్ డైరెక్టర్లు..!!
By: Tupaki Desk | 22 Dec 2020 4:00 PM ISTటాలీవుడ్ ఇండస్ట్రీలో నటసింహం బాలకృష్ణ సినిమా అంటే ఓ రేంజిలో అంచనాలు నెలకొంటాయి. ఎందుకంటే బాలయ్య డైలాగులు.. యాక్షన్.. ఫైట్స్ అన్నీ కూడా అదే రేంజిలో రూపొందిస్తారు డైరెక్టర్లు. ప్రస్తుతం బాలకృష్ణ.. బోయపాటి శ్రీను దర్శకత్వంలో మూడో సినిమా చేస్తున్నాడు. గతంలో వీరి కాంబినేషన్‌లో వచ్చిన సింహా, లెజెండ్ సినిమాలు భారీ విజయాలు సాధించటంతో ఈ సినిమా పైన భారీ అంచనాలే నెలకొన్నాయి. ఈ సినిమాను మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్నాడు. అయితే బోయపాటి ఇంతకుముందు రాంచరణ్ హీరోగా వినయ విధేయ రామ సినిమా తీసి భారీ ప్లాప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ప్రస్తుతం బాలయ్యతో రూపొందిస్తున్న బిబి3 సినిమా పట్ల చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడట.
ఇదిలా ఉండగా.. మరి బాలయ్య - బోయపాటి సినిమా అంటే మాస్ అంశాలతో పాటు మాంచి ఐటమ్ సాంగ్స్ కూడా ఎక్సపెక్ట్ చేస్తారు ఫ్యాన్స్. అలాగే అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప మూవీలో కూడా ఐటమ్ సాంగ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఎందుకంటే.. అది సుకుమార్ మార్క్ మరి. బాలయ్య సరసన సయేషా సైగల్, బన్నీ సరసన రష్మిక హీరోయిన్లుగా ఓకే అయిపోయారు. సుక్కు, బోయపాటిలకు ఐటమ్ సాంగ్స్ కోసం ఇంకా హీరోయిన్స్ దొరకేలేదట. ప్రస్తుతం ఈ రెండు సినిమాలలో ఐటమ్ హీరోయిన్లుగా ఎవరెవరు ఓకే అవుతారు.. అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్. ఇప్పటివరకు వీరి సినిమాలలో కుర్రభామలే ఐటమ్ సాంగ్స్ లలో అభిమానులను ఊర్రూతలుగించారు. చూడాలి మరి.. ఒకవైపు థమన్, మరోవైపు దేవిశ్రీప్రసాద్ ఎలాంటి ఐటమ్ నెంబర్స్ తో ఆడిపాడించనున్నారో..!!