Begin typing your search above and press return to search.
మాస్ మహారాజా గురించి ఇది మీకు తెలుసా?
By: Tupaki Desk | 28 Jan 2023 9:00 PM GMTమాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం సక్సెస్ జోష్ తో వున్నాడు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ మూవీతో ట్యాక్ లోకి వచ్చేసిన రవితేజ ఆ తరువాత వరుసగా బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లని సొంతం చేసుకున్నాడు. అయితే ఇదే సమయంలో త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ 'ధమాకా' మూవీతో మళ్లీ బ్లాక్ బస్టర్ హిట్ ని దక్కించుకోవడమే కాకుండా ఈ సినిమాతో వంద కోట్ల క్లబ్ లో చేరిపోయి ట్రేడ్ వర్గాలకు షాకిచ్చాడు. ఫస్ట్ డే ఫస్ట్ షోకు యావరేజ్ టాక్ రావడంతో అంతా పెదవి విరిచారు కానీ అనూహ్యంగా టాక్ మారడం, వసూళ్లు పెరగడంతో సినిమా బ్లాక్బస్టర్ హిట్ అనిపించుకుంది.
ఈ సక్సెస్ తో మళ్లీ ట్రాక్ లోకి వచ్చేసిన రవితేజకు వెంటనే మరో హిట్ ఖాతాలో చేరింది. అదే 'వాల్తేరు వీరయ్య'. బాబి డైరెక్టర్ గా మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా తెరకెక్కిన ఈ మూవీ ఈ సంక్రాంతికి భారీ స్థాయిలో విడుదలై బాక్సాఫీస్ వద్ద పూనకాలు తెప్పిస్తోంది.
ఇందులో రవితేజ కీలక అతిథి పాత్రలో నటించి సినిమా భారీ విజయానికి ప్రధాన పాత్ర పోషించాడు. దీంతో ఈ మూవీ వరల్డ్ వైడ్ గా భారీ వసూళ్లని రాబడుతూ సంచలనాలు సృష్టిస్తోంది.
ప్రస్తుతం రవితేజ 'రవణాసుర' మూవీలో నటిస్తున్నాడు. మొత్తం ఐదుగురు హీరోయిన్ లు నటిస్తున్న ఈ మూవీని సుధీర్ వర్మ తెరకెక్కిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ చిత్రీకరణ దశలో వుంది. సుశాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీని ఏప్రిల్ 7న పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయిలో రిలీజ్ చేయబోతున్నారు. ఇదిలా వుంటే మాస్ మహారాజా రవితేజ ఇంటికి సంబంధించిన ఆసక్తికరమైన విశేషాల్ని కమల్ అనే నటుడు తాజాగా వెల్లడించాడు.
'సీతారామయ్యగారి మనవరాలు' మూవీతో నేను హీరోగా పరిచయం అయ్యాను. అప్పటికీ రవితేజ ఇంకా హీరోగా కాలేదు. ఇప్పుడెంత ఎనర్జీగా కనిపిస్తున్నాడో.. అప్పుడు కూడా అంతే ఎనర్జీతో వుండేవాడు.
కాకపోతే కాస్త లావుగా కనిపించే వాడు రవితేజ. కెరీర్ లో ఎంతో కష్టపడి తనని తాను మార్చుకుని యంగ్ హీరోలకు టఫ్ కాంపిటీషన్ ఇస్తున్నాడు. ఇప్పటికీ రవితేజ ప్రతీ రోజు ఎక్సర్ సైజులు చేస్తాడు అని చెప్పుకొచ్చాడు.
ఈ మధ్యనే రవితేజను కలిశాను. కెరీర్ ప్రారంభంలో హైదరాబాద్ లో ట్రిబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ వుంటే చాలనుకుని వచ్చాను. ఆ తరువాత వచ్చిందంతా బోనసే అని నాతో అన్నాడు. అలాంటి రవితేజ ఇప్పుడు రూ. 12 కోట్లు విలువ చేసే ఇంట్లో వుంటున్నాడు. చిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి ఇప్పుడు మాస్ మహారాజా అనిపించుకుంటున్నాడని రవితేజపై కమల్ ప్రశంసల వర్షం కురిపించాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.