Begin typing your search above and press return to search.

మార్వ‌ల్ టీజ‌ర్: క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ట్రీట్

By:  Tupaki Desk   |   20 April 2021 5:30 AM GMT
మార్వ‌ల్ టీజ‌ర్: క‌ళ్లు చెదిరే యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ట్రీట్
X
క‌ళ్లు చెదిరే మార్ష‌ల్ ఆర్ట్స్ యాక్ష‌న్ అడ్వెంచ‌ర‌స్ విన్యాసాల‌తో మార్వ‌ల్ సినిమాటిక్స్ నుంచి వ‌చ్చిన తాజా యాక్ష‌న మూవీ టీజ‌ర్ ఆద్యంతం ర‌క్తి క‌ట్టిస్తోంది. ఇది యాక్ష‌న్ స్టార్ సిము లియు పుట్టినరోజు ట్రీట్. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో అతని శక్తివంతమైన రాకను ఎలివేట్ చేస్తూ అభిమానులు ఈ స్పెష‌ల్ డేని సెల‌బ్రేట్ చేసుకునేందుకు సంస్థ ఇచ్చిన కానుక ఈ టీజ‌ర్. షాంగ్ చి `ది లెజెండ్ ఆఫ్ టెన్ రింగ్స్` మొదటి టీజర్ ఏప్రిల్ 19 న విడుదలైంది.

మొదటి టీజర్.. ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్ లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో శక్తివంతమైన యాక్ష‌న్ స్టార్ రాకను ఆవిష్క‌రించింది. అలాగే ప్రత్యేక పుట్టినరోజు కానుకగా షాంగ్ చి ఈ చిత్రం కోసం సరికొత్త పోస్టర్ ను తన సోషల్ మీడియా ఛానెళ్లలో పంచుకున్నారు. సరికొత్త టీజర్ లో “మీ స్థానంలో మీరు వార్ లో పాల్గొనవలసిన సమయం ఆసన్నమైంది” అని వ్యాఖ్య‌ను జోడించారు. కానీ షాంగ్-చి తన గతాన్ని విడిచి రహస్యమైన టెన్ రింగ్స్ సంస్థ వెబ్ లోకి ఆకర్షించబడ‌తాడు.

దాదాపు పూర్తి ఆసియా తారాగణంతో తెర‌కెక్కిన మార్వ‌ల్ స్టూడియోస్ సినిమా ఇద‌ని చెబుతున్నారు న‌టుడు సిము లియు. టీజ‌ర్ ఆద్యంతం అత‌డి మార్ష‌ల్ విద్య‌లు యాక్ష‌న్ అడ్వెంచ‌ర్ ఆక‌ట్టుకుంటున్నాయి.
ఈ చిత్రంలో వెన్వు పాత్రలో టోనీ తెంగ్.. షాంగ్-చి యొక్క స్నేహితుడు కాటిగా అక్వాఫినా.. జియాంగ్ నాన్ పాత్రలో మిచెల్ యేహ్.., అలాగే ఫాలా చెన్, .. మెంగ్ జాంగ్,.. ఫ్లోరియన్ ముంటెయాను.. రోనీ చియెంగ్ త‌దిత‌ర ఆసియ‌న్లు నటించారు.

షాంగ్-చి `ది లెజెండ్ ఆఫ్ ది టెన్ రింగ్స్` కి డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ దర్శకత్వం వహించారు.కెవిన్ ఫీజ్ -జోనాథన్ స్క్వార్ట్జ్ నిర్మించారు,. డేవిడ్ కల్లాహం & డెస్టిన్ డేనియల్ క్రెట్టన్ & ఆండ్రూ లాన్హామ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే రాశారు. 3 సెప్టెంబర్ 2021 న థియేటర్లలో విడుద‌ల కానుంది.