Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: బ్లాక్‌ విడో మరో వండర్ ఉమెనా?

By:  Tupaki Desk   |   10 March 2020 3:52 AM GMT
ట్రైలర్ టాక్‌: బ్లాక్‌ విడో మరో వండర్ ఉమెనా?
X
మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి వచ్చే సూపర్‌ హీరో చిత్రాలకు వరల్డ్‌ వైడ్ గా ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. 2019-20 సీజ‌న్ లో ప‌లు భారీ బ‌డ్జెట్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించడమే గాక గ‌త రికార్డుల్ని బ్రేక్ చేసి సంచ‌ల‌నాలు అయ్యాయి. గతేడాది 'అవెంజర్‌: ఎండ్‌ గేమ్‌' సరికొత్త వరల్డ్ రికార్డ్ లను సృష్టించింది. ప్ర‌పంచంలోనే నంబ‌ర్ వ‌న్ కలెక్షన్లని రాబట్టిన చిత్రంగా నిలిచింది. మార్వెల్‌ స్టూడియోస్‌ నుంచి వస్తున్న 24వ చిత్రం `బ్లాక్‌ విడో` ప్ర‌స్తుతం ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.

మార్వెల్ ఫ్రాంఛైజీల్లోని సూపర్‌ హీరో క్యారెక్టర్‌ అయిన బ్లాక్‌ విడో పాత్రని ఆధారంగా చేసుకుని ఈ సినిమాని రూపొందించారు. ఇందులో స్కార్లెట్‌ జాన్సన్‌ నటాషాగా.. బ్లాక్‌ విడోగా నటించారు. తాజా ట్రైలర్ ని విడుదల చేశారు. నటాషా బ్లాక్‌ విడో గతంలో చేసిన మిస్టేక్స్ ఇప్పుడు వెంటాడుతుంటాయి. పాత శత్రువులు తనని అంతం చేసేందుకు ప్రయత్నిస్తుంటారు. తప్పని పరిస్థితుల్లో తనని తన వారిని తన భూమిని రక్షించుకునేందుకు నటాషా కాస్త బ్లాక్‌ విడోగా మారి చేసే అద్భుతమై సాహసోపేతమైన పోరాటాలే ఈ చిత్ర కథ. తాజాగా ట్రైలర్‌ ఆద్యంతం కనువిందు చేస్తుంది. ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సీక్వెన్స్.. స్కార్లెట్‌ జాన్సన్‌ విరోచిత పోరాటం.. విజువల్స్.. బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌ ట్రైలర్ లో హైలైట్ గా నిలిచాయి. ముఖ్యంగా బ్లాక్‌ విడోగా స్కార్లెట్‌ నట విశ్వరూపం చూడొచ్చు. ఈ ఏడాది మరో వండర్‌ రాబోతుందని చెప్పొచ్చు.

కేట్‌ షార్ట్ లాండ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం లో స్కార్లెట్ తోపాటు.. ఫ్లోరెన్స్ పగ్‌- డేవిడ్‌ హర్బర్‌- ఓటీ ఫాగ్‌ బెల్నె- విలియమ్‌ హర్ట్- రచెల్‌ వీజ్‌ మెయిన్‌ కాస్టింగ్ గా నటిస్తున్నారు. ఈ చిత్రం ఏప్రిల్‌ 30న సమ్మర్‌ స్పెషల్ గా విడుదల కానుంది. ఇండియాలోనూ భారీ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు. ఇటీవల హాలీవుడ్‌ చిత్రాలను భారతీయ భాషల్లో కూడా విడుదల చేస్తున్న విషయం విదితమే.