Begin typing your search above and press return to search.

మర్వెల్ స్టూడియోస్.. మరో రెండు 'అవేంజర్స్' అద్భుతాలు

By:  Tupaki Desk   |   24 July 2022 10:30 AM GMT
మర్వెల్ స్టూడియోస్.. మరో రెండు అవేంజర్స్ అద్భుతాలు
X
మార్వెల్ స్టూడియోస్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించే సూపర్ హీరోల సినిమాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వాటికి ప్రపంచవ్యాప్తంగా ఊహించని స్థాయిలో ప్రతిసారి క్రేజ్ దక్కుతోంది. అందుకే కొన్ని కథలు ముగిసినప్పటికీ కూడా మళ్లీ ఏదో ఒక పాయింట్ తో సూపర్ హీరోలను మళ్ళీ వెండి తెరపై చూపిస్తున్నారు. ఇక అవెంజర్స్ అంటే చూడని సినీ లవర్స్ ఉండరు. అవెంజర్ సూపర్ హీరోలు కథలు ఎండ్ అయినట్లు గతంలోనే ముగిసిపోయినట్లుగా చాలా రకాల కథనాలు వెలుపడ్డాయి.

ఇక చివరగా అయితే మార్వెల్స్ లో ఉన్నటువంటి సూపర్ హీరోస్ అందరినీ ఏకం చేసి చివరగా ''అవెంజర్స్ ఎండ్ గేమ్'' ను తీసుకు వచ్చిన విషయం తెలిసిందే. అదే చివరి సిరీస్ అని చెప్పడంతో అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే కొంతమంది ఆడియన్స్ ఎక్కువగా అవెంజర్స్ ను కోరుకుంటున్నారని తెలియడంతో మార్వెల్ స్టూడియోస్ కొత్త తరహా స్టోరీలతో సినిమాలను తెరపైకి తీసుకురాబోతోంది.

గ్లోబల్ వైజ్ గా మంచి మార్కెట్ ఏర్పరచుకున్న అవెంజర్స్ కథలను మళ్లీ పుట్టించాలి అని మార్వెల్ స్టూడియోస్ ఒక కొత్త తరహా ప్రణాళికలను రచిస్తోంది. గత అవెంజర్స్ లోని కొన్ని సినిమాల కు సంబంధించిన ప్రధానమైన సన్నివేశాలను తీసుకుని ఊహించిన విధంగా మళ్లీ కొత్త తరహా సినిమాలను వెండితెర పైకి తీసుకువచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక రీసెంట్ గా మరో రెండు సినిమాలను ఎనౌన్స్ చేశారు.

''అవెంజర్స్ ది కాంగ్ డైనస్టీ'' అలాగే ''అవెంజర్స్ సీక్రెట్ వార్స్'' ను కూడా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. వీటిలో ''అవెంజర్స్ ది కాంగ్ డైనస్టీ'' 2025 మే 2 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుండగా.. ''అవెంజర్స్ సీక్రెట్ వార్స్'' సినిమాను 2025 లో నవంబర్ 7న రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. అలాగే వీటిలో కొన్ని కథలకు సాగింపుగా భవిష్యత్తులో మరిన్ని సూపర్ హీరోల సినిమాలను తీసుకురావడానికి మార్వెల్ సంస్థ కథలను కూడా సిద్ధం చేస్తోంది. ఒకదానికొకటి సంబంధం ఉండేలా మళ్లీ అంతకుమించి అనేలా వెండితెరపై విజువల్ ట్రిటీ ఇవ్వాలని అనుకుంటున్నారు. మరి ఈ సినిమాలకు ఏ స్థాయిలో గుర్తింపు లభిస్తుందో చూడాలి.