Begin typing your search above and press return to search.

ప్రభాస్ డేట్స్ కోసమే మారుతి వెయిటింగ్!

By:  Tupaki Desk   |   8 May 2022 1:30 AM GMT
ప్రభాస్ డేట్స్ కోసమే మారుతి వెయిటింగ్!
X
'రాధేశ్యామ్' భారీ ఫ్లాప్ ను రుచి చూసినా, ఆ విషయాన్ని గురించి ప్రభాస్ పెద్దగా పట్టించుకోకుండా ఆ తరువాత సినిమా లను చేసుకుంటూ వెళుతున్నాడు. ఆల్రెడీ 'ఆది పురుష్' సినిమాను పూర్తి చేసిన ప్రభాస్, 'సలార్' సినిమా కూడా పూర్తి చేసే పనిలో ఉన్నాడు. 'ఆది పురుష్' రామాయణ కథా కావ్యానికి దృశ్యరూపం. ప్రభాస్ తన కెరియర్లో తొలిసారిగా చేసిన పౌరాణిక చిత్రం. అందువలన ఆయన సక్సెస్ గ్రాఫ్ ను మళ్లీ పరిగెత్తించే పవర్ ఈ సినిమాకి ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక 'సలార్' కూడా ఆయనకి పూర్వ వైభవాన్ని తెచ్చిపెట్టే స్థాయి ఉన్నదేనని మాస్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా కూడా పాన్ ఐడియా స్థాయిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక ఈ సినిమా షూటింగులో పాల్గొంటూనే .. మరో వైపున 'ప్రాజెక్టు K' సినిమా షూటింగులోను ప్రభాస్ పాల్గొంటున్నాడు.

నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అత్యంత భారీ బడ్జెట్ తో వైజయంతీ మూవీస్ వారు నిర్మిస్తున్నారు. టైమ్ మిషన్ నేపథ్యంలో ఈ కథ నడుస్తుందని అంటున్నారు. సైంటిస్ట్ పాత్రలో అమితాబ్ కనిపించనుండగా, ఆయన కూతురి పాత్రలో దీపిక అలరించనుంది. ఇది పాన్ వరల్డ్ మూవీ అని నాగ్ అశ్విన్ చెప్పడం అందరిలో మరింత ఆసక్తిని పెంచుతోంది.

ఈ సినిమా తరువాత ప్రభాస్ .. మారుతి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మారుతి కూడా ఈ విషయాన్ని ధృవీకరించాడు. ఈ సినిమాకి 'రాజా డీలక్స్' అనే టైటిల్ ను పరిశిలీస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి.

ఈ ప్రాజెక్టుకు సంబధించిన సన్నాహాలు జరుగుతూ ఉండగానే, మారుతికి పితృవియోగం కలిగింది. అందువలన ఈ ప్రాజెక్టుకి సంబంధించిన పనిలో కాస్త స్లో అయ్యాయి. ఈ ప్రాజెక్టు ముందుకు వెళ్లడానికి ప్రభాస్ డేట్ల సమస్య ప్రధాన కారణంగా మారిందని అంటున్నారు.

'సలార్' .. 'ప్రాజెక్ట్ K' రెండూ కూడా పెద్ద ప్రాజెక్టులే. ఈ రెండు సినిమాల మధ్య ఓ మాదిరి బడ్జెట్ లో మారుతి సినిమా చేయాలని ప్రభాస్ అనుకున్నాడు. అయితే ఆ రెండు సినిమాల మధ్యలో ఈ సినిమా చేయాలంటే ప్రభాస్ పూర్తి క్లారిటీతో డేట్స్ ఇవ్వవలసి ఉంటుంది. ఇంతవరకూ అలాంటిదేమీ జరగలేదట. ప్రభాస్ డేట్స్ ఇచ్చిన తరువాతనే వాటిని బట్టి ఇతర ఆర్టిస్టులను ఎంపిక చేసి వారి డేట్లను తీసుకోవలసి ఉంటుంది. అలాగే టెక్నీషయన్లను రంగంలోకి దింపవలసి ఉంటుంది. అందువలన ప్రభాస్ డేట్లకి సంబంధించిన క్లారిటీ రాకపోవడమే అసలు సమస్య అంటున్నారు. ఈ కారణంగానే ఈ ప్రాజెక్టు లేట్ అవుతుందని చెబుతున్నారు.