Begin typing your search above and press return to search.

ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి మారుతి ఊహించ‌ని ట్రీట్‌?

By:  Tupaki Desk   |   15 Oct 2022 7:11 AM GMT
ప్ర‌భాస్ ఫ్యాన్స్ కి మారుతి ఊహించ‌ని ట్రీట్‌?
X
పాన్ ఇండియా స్టార్ ప్ర‌భాస్ ప్ర‌స్తుతం బ్యాక్ టు బ్యాక్ మూడు భారీ క్రేజీ ప్రాజెక్ట్ ల‌లో న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. ఇందులో పైథాలాజిక‌ల్ డ్రామా 'ఆదిపురుష్' వ‌చ్చే ఏడాది సంక్రాంతికి వ‌ర‌ల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వ‌ద్ద సంద‌డి చేయ‌బోతోంది. ఇక ప్ర‌శాంత్ నీల్ తో చేస్తున్న 'స‌లార్‌', నాగ్ అశిన్ డైరెక్ట్ చేస్తున్న 'ప్రాజెక్ట్ కె' సినిమాల్లో న‌టిస్తున్నాడు. ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్ లు ప్రస్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్నాయి. అయితే ఈ మూవీస్ అండ‌ర్ ప్రొడ‌క్ష‌న్ లో వుండ‌గానే ప్ర‌భాస్ మ‌రో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిన విష‌యం తెలిసిందే.

ద‌ర్శ‌కుడు మారుతి ద‌ర్శ‌క‌త్వంలో ఓ హీర‌ర్ థ్రిల్ల‌ర్ ని ప్ర‌భాస్ చేయ‌డానికి రెడీ అవుతున్నారు. మారుతి ట్రాక్ రికార్డ్ ని దృష్టిలో పెట్టుకుని ఫ్యాన్స్ త‌న‌తో సినిమా వ‌ద్ద‌ని వారిస్తున్నా ప్ర‌భాస్ మాత్రం ఎక్క‌డా వెన‌క‌డుగు వేయ‌డం లేదు. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ బ్యాన‌ర్ పై ఈ భారీ పాన్ ఇండియా మూవీని టి. జి. విశ్వ‌ప్ర‌సాద్ అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. గ‌త కొన్ని నెల‌లుగా వార్త‌ల్లో నిలుస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్ట‌కేల‌కు ప‌ట్టాలెక్క‌బోతోంది.

సోమ‌వారం పూజా కార్య‌క్ర‌మాల‌తో సైలెంట్ గా ఈ మూవీని టీమ్ ప్రారంభించ‌బోతోంది. ఇదిలా వుంటే ఈ ప్రాజెక్ట్ విష‌యంలో కంగారు ప‌డుతున్న ప్ర‌భాస్ అభిమానుల‌కు ఈ మూవీతో ద‌ర్శ‌కుడు మారుతి ఊహించ‌ని ట్రీట్ ఇవ్వ‌బోతున్నాడ‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. ఇంత వ‌ర‌కు ప్ర‌భాస్ డ్యుయెల్ రోల్ లో క‌నిపించ‌ని విష‌యం తెలిసిందే. అయితే మారుతి త‌న సినిమాలో ప్ర‌భాస్ కోసం టూ డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ ని డిజైన్ చేశాడ‌ట‌.

ఈ హార‌ర్‌ థ్రిల్ల‌ర్ స్టోరీలో ప్ర‌భాస్ తొలిసారి తాత‌గా, మ‌న‌వ‌డిగా రెండు విభిన్న‌మైన పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నాడ‌ని తెలుస్తోంది. ఇదే నిజ‌మైతే ప్ర‌భాస్‌ అభిమానుల‌కు ఊహించ‌ని ట్రీట్ గా ఈ మూవీ వుండే అవ‌కాశం వుంద‌ని చెబుతున్నారు. ఇప్ప‌టికే ఈ క్యారెక్ట‌ర్స్ కోసం ప్ర‌భాస్ పై లుక్ టెస్ట్ ని నిర్వహించిన‌ట్టుగా తెలుస్తోంది. సోమ‌వారం నుంచి ప్రారంభం కానున్నీ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ వారం పాటు సాగ‌నున్న‌ట్టుగా తెలుస్తోంది.

ఈ మూవీలో ప్ర‌భాస్ కు జోడీగా ముగ్గురు క్రేజీ హీరోయిన్ లు న‌టించ‌బోతున్నారు. ఇప్ప‌టికే ఇద్ద‌రిని మారుతి ఫైన‌ల్ చేశాడు కూడా. అందులో మాల‌వికా మోహ‌న‌న్ ఒక‌రు కాగా మ‌రొక‌రు నిధి అగ‌ర్వాల్ ఒక‌రు. మ‌రో క్రేజీ లేడీని ఎంపిక చేయాల్సి వుంది. ఫ‌స్ట్ షెడ్యూల్ త‌రువాత అయినా మూడ‌వ హీరోయిన్ ని ఫైన‌ల్ చేస్తారేమో చూడాలి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.